నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మానవతా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని ఉరి తీసి చంపేశాడో కర్కశుడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలో సాదు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నీటి తొట్టి ఉంది. దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి పడింది.
మూగ జీవిని కాపాడాల్సింది పోయి మిగతా కోతులు చూస్తుండగా దాన్ని ఉరివేసి తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆ కోతి చనిపోవటంతో దాన్ని కుక్కలకు ఆహారంగా పడేశాడు. మిగతా కోతులు కుక్కలు, మనుషులను దగ్గరికి రానీయకుండా మృతిచెందిన కోతిని తీసుకెళ్లి తమలోని ఐకమత్యాన్ని చాటుకున్నాయి. మూగజీవాల పట్ల ఇంత దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి..