Khairtabad Ganesh Idol 2022 Released: దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గణేశుడిగా పేరొందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి శ్రీపంచముఖ మహా లక్ష్మీగణపతి పేరుతో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధిన వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. దానితో పాటు.. వినాయకుడి విగ్రహం నమూనా చిత్రాన్ని గణేశ్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. విగ్రహం 50 అడుగుల ఎత్తు ఉండనుంది. వినాయకుడికి ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి, కుడివైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రి దేవి కొలువుదీరనున్నారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ప్రత్యేకతలు..
- శ్రీపంచముఖ లక్ష్మీ మహాగణపతి విగ్రహం ఎత్తు 50 అడుగులు.
- ఐదు తలలు, 6 చేతులతో గణేశుడి విగ్రహాన్ని రూపుదిద్దనున్నారు.
- అలంకరణ కోసం తలపై ఏడు సర్పాలను ఉంచనున్నారు.
- కుడివైపు శ్రీ త్రిశక్తి మహాగాయత్రి , ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రహమణ్యా స్వామి విగ్రహాలు ఏర్పాటుకానున్నాయి.
ఇదీ చూడండి: Rains: తెలంగాణలో చిరు జల్లులు - రెచ్చిపోయిన దొంగలు.. గన్స్‌తో వచ్చి చోరీ.. అడ్డొచ్చిన యజమాని హత్య
- ద్రౌపది X యశ్వంత్.. గెలుపెవరిది? 'ఇంద్రధనుస్సు' కూటమి మేజిక్ చేసేనా?