ETV Bharat / city

మహేశ్‌బాబు ఇంట్లో చోరీకి యత్నం.. 30 అడుగుల గోడ పైనుంచి దూకి.. - Theft at Mahesh Babuhouse

సూపర్ స్టార్ మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. దీంతో మహేశ్ ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఓ వ్యక్తి ఇదే సమయంలో మహేశ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. ఏకంగా 30 అడుగుల గోడ పైనుంచి దూకాడు. ఆ తర్వాత ఏమైందంటే...

Mahesh
Mahesh
author img

By

Published : Sep 29, 2022, 12:34 PM IST

సినీ నటుడు మహేశ్‌బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి ఓ ఆగంతుకుడు దూకాడు. ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని కాపలాదారులు గమనించి అదుపులోకి తీసుకొన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.81లో మహేష్‌బాబు నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ పక్కగా పెద్ద శబ్దం వచ్చింది.

కాపలాదారులు వెళ్లి చూసి ఓ వ్యక్తి గాయాలపాలై పడి ఉండటం గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకొని విచారించడంతోపాటు జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అతన్ని విచారించి.. మూడు రోజుల కిందట ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న ఒక నర్సరీ వద్ద ఉంటున్నాడు. చోరీకని వచ్చి 30 అడుగుల గోడ పైనుంచి దూకాడు. నిందితుణ్ని కృష్ణ(30)గా గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో మహేష్‌బాబు నివాసంలో లేరు. కాపలాదారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.