ETV Bharat / city

వోచర్​తో బ్యాంక్​కు బురిడీ: రూ.30 లక్షలతో పరారీ - latest crime news in khammam district

బ్యాంక్​ ఏటీఎంలో డబ్బులు లేవని.. ప్రధాన శాఖ వారు మీ బ్యాంక్​ నుంచి డబ్బులు తీసుకురమ్మాన్నారంటూ వచ్చాడు. వోచరూ చూపించాడు. నమ్మిన మేనేజర్ వచ్చిన అతనికి డబ్బులిచ్చి పంపించాడు. సాయంత్రం ప్రధాన శాఖ వారిని సంప్రదిస్తే... తాము ఎవరినీ పంపలేదని తమకు డబ్బూ అందలేదని చెప్పారు. డబ్బులు తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్​ చేస్తే... స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయామని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

a man theft 30 lakhs rupees from a bank in khammam

author img

By

Published : Feb 14, 2020, 5:26 PM IST

వోచర్​తో బ్యాంక్​కు బురిడీ: రూ.30 లక్షలతో పరారీ

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న వెంకన్న... బ్యాంకులో జమ చేయాల్సిన రూ.30 లక్షల నగదుతో ఉడాయించాడు. అనంతరం ఫోన్​ స్విచ్ఛాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ మేరకు బ్యాంక్​ మేనేజర్ పోలీసులకు​ ఫిర్యాదు చేశాడు.

ఖమ్మంలోని సీఐఎస్​సీవో అనే ప్రైవేటు ఏజెన్సీలో వెంకన్న పదేళ్లుగా పని చేస్తున్నాడు. బ్యాంకుల్లో నగదు తీసుకొని ఏటీఎంలలో పెట్టడం... ఒక బ్యాంక్​ నుంచి మరొక బ్యాంక్​కు నగదును తరలించడం అతని పని. ఈనెల 11న నిందితుడు వెంకన్న... గాంధీ చౌక్​లోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​కు వెళ్లి వైరా రోడ్డులోని ప్రధాన శాఖ​వారు రూ.30 లక్షలు తీసుకురమ్మన్నారని వోచర్ చూపించాడు.

ఆ శాఖవారు వెంకన్నకు రూ.30 లక్షలు ఇచ్చారు. సాయంత్రం బ్యాంక్​ మూసివేసే సమయంలో లెక్కలు చూస్తుండగా ప్రధాన శాఖకు డబ్బులు చేరలేదని గుర్తించారు. ఇదే విషయమై నిందితుడికి ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్​ వచ్చింది. వెంటనే విషయాన్ని పై అధికారులకు తెలిపారు. బ్యాంక్​ మేనేజర్ వెంకట కృష్ణారావు​ మూడో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి

కుమార్తెకు పెళ్లి కానుకగా ఎడ్ల బండిలో 2200 పుస్తకాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.