తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాజేశ్వర్రావుపేట పంప్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను నీటిలో మునిగిపోతున్న దృశ్యాలను స్థానికులు చరవాణిలో చిత్రీకరించారు. అతను కాల్వ ఒడ్డున వదిలిన వాహనం మాత్రం కటకం గంగాధర్ పేరుతో నిజామాబాద్ రిజిష్ట్రేషన్ కలిగి ఉంది.
అతను నీటిలో దూకినప్పుడు పంప్ హౌస్ వద్ద 500 మీటర్ల లోతు నీరు ఉండటంతో అతన్ని కాపాడే ప్రయత్నం స్థానికులు చేయలేదు. నీటిలో దూకిన తర్వాత కొద్దిసేపు పైకి తేలినప్పటికీ ఆ తర్వాత మునిగిపోయాడు. అతన్ని వెలికి తీస్తేనే అతను ఎవరో తెలిసే అవకాశం ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్నివెలికి తీశారు.
ఇదీ చదవండి: 'మహిళలపై దాడులు, అఘాయిత్యాల్లో సగం వాలంటీర్ల పనే'