ETV Bharat / city

వాగులో కొట్టుకుపోయిన లారీ... డ్రైవర్ కోసం గాలింపు - heavy rains

కుండపోత వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపైనా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఓ లారీ వాగులో కొట్టుకుపోయింది. ఎలాగోలా వాగు దాటాలని ప్రయత్నించిన లారీ డ్రైవర్​ వాగులో కొట్టుకుపోగా... క్లీనర్​ను స్థానికులు రక్షించారు. ఆ డ్రైవర్​ను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

lorry swept in flood
వాగులో కొట్టుకుపోయిన లారీ
author img

By

Published : Aug 15, 2020, 9:31 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో జ‌ల‌వ‌న‌రులు నీటిక‌ళ‌ను సంత‌రించుకున్నాయి. మరోవైపు వరద ప్రవాహాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వంతెనపై నుంచి మోయతుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం లారీ డ్రైవర్ లారీతో సహా వాగు దాటే ప్రయత్నం చేయగా.. లారీ కొట్టుకు పోయింది.

లారీ క్లీనర్​ను గ్రామస్థులు రక్షించారు. డ్రైవర్ వాగులో కొట్టుకు పోతూ, ఒక చెట్టును పట్టుకుని దానిపై ఆధారపడి మధ్యాహ్నం వరకు ప్రాణం కాపాడుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. సహాయక చర్యలు కాస్త ఆలస్యం కావడం వల్ల అతన్ని రక్షించటానికి గ్రామస్థులు తాళ్లు కట్టిన రబ్బర్ ట్యూబును వదిలారు. దానిని పట్టుకున్న డ్రైవర్​ను ఒడ్డుకు లాగే ప్రయత్నంలో, వాగు మధ్య వరకు వచ్చిన లారీ డ్రైవర్ వాగులో ప్రవాహం ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. లారీ డ్రైవర్ ను ఆదిలాబాద్​ జిల్లాకు ముదిగొండ శంకర్​గా గుర్తించారు.

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ హైదరాబాద్ రెస్క్యూ టీం అధికారులతో మాట్లాడి వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెస్క్యూ టీం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​తో, ఘటనా స్థలానికి కొంచెం ఆలస్యంగా చేరుకుంది. అప్పటికే డ్రైవర్ వాగులో కొట్టుకుపోయాడు.

వరంగల్, కరీంనగర్, సిద్దిపేట నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. కానీ.. వారి రాక గురించిన సమాచారం తెలియని గ్రామస్థులు, సదుద్దేశంతో చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. హెలికాప్టర్ కొంత ముందుగా చేరుకున్నా, గ్రామస్థులు తమ యత్నాలు చేయకున్నా డ్రైవర్ బయటపడటానికి అవకాశం ఉండేదేమోనని స్థానికులు అంటున్నారు. మొత్తానికి దాదాపు 10 గంటల పాటు వాగులో చెట్టును పట్టుకొని ప్రాణాలను కాపాడాలని సహాయం కోసం ఎదురు చూసిన డ్రైవర్ శంకర్ చివరకు వాగులో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు.

డ్రైవర్ శంకర్ చివరి క్షణాల్లో వాగులో మునుగుతూ గల్లంతు అవుతున్న దృశ్యాలు ఓ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక శంకర్ బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటులో డ్రైవర్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం వర్షం కురుస్తుండటం వల్ల గాలింపు చర్యలను నిలిపివేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోంది: బొండా ఉమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.