హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో ఓ చిరుత బోనులో చిక్కింది. వాలంతరి వద్ద ఉదయం 4 గంటలకు బోనులోకి వచ్చి ఇరుక్కుపోయింది. ఈ చిరుత శనివారం వాలంతరి వద్ద ఓ పశువుల పాకలో దూడలను చంపింది. అటవీశాఖ అధికారులు చిరుత కోసం నిన్న బోన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోన్లలో నిన్న చనిపోయిన రెండు దూడలను ఉంచారు. చనిపోయిన దూడల కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. కొన్ని నెలలుగా చిరుత ఇక్కడ సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మూడు రోజుల పాటు వర్షాలు