తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైంది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏటా స్వామి వారి కల్యాణోత్సవంలో స్వామి వారి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు. రాత్రి అనూహ్యంగా రథం దగ్ధం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరి హస్తమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి