ETV Bharat / city

అన్నదాత ఆత్మహత్యకు సిద్ధపడితేగానీ.. ధాన్యం కదలలేదు! - grain purchasing in Khammam

ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ ఓ రైతు వాటర్​ ట్యాంక్​​ ఎక్కి నిరసన తెలిపాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్​ మండలం ఆళ్లపాడు గోవిందపురం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకుంటానని వాటర్​ట్యాంక్​ ఎక్కాడు.

farmer suicide attempt
అన్నదాత ఆత్మహత్యకు సిద్ధపడితే గాని ధాన్యం కదలలేదు
author img

By

Published : Jun 8, 2021, 12:28 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడు గోవిందపురం గ్రామంలో ఓ రైతు వాటర్​ట్యాంక్​ ఎక్కి ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయడం లేదని... అందుబాటులో లారీలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నాడు. లారీ పంపించాలంటే ప్రతి బస్తాకు రూ.10 చొప్పున ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారని ఆరోపించాడు. తమ సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సమీపంలోని వాటర్​ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపాడు.

విషయం తెలుసుకున్న ఎంపీ నామ నాగేశ్వరరావు రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావుతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. స్పందించిన అధికారులు గ్రామానికి రెండు లారీలు పంపించి సమస్యను పరిష్కరించారు.

ఇదీ చూడండి:

మదనపల్లెలో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరికి చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.