ETV Bharat / city

FAMILY SUICIDE: అప్పుల బాధ తాళలేక... కుటుంబం అంతపని చేసింది - కూర్మల్ గూడలో చెరువులో ఆత్మహత్య

FAMILY SUICIDE: 'కూటి కోసం కోటి విద్యలు' అంటారు పెద్దలు. ఏ పని చేసినా అది జానెడు కడుపు నింపుకోవడానికే మరి. ఎందుకంటే ఆకలికి పరిస్థితులతో దానికి సంబంధం లేదు. ఆ తిండి కోసం చాలా మంది నానవస్థలు పడతారు. అలా కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేస్తున్నారు సామాన్యులు. చివరికి ఆ అప్పులు తీర్చే పరిస్థితి లేక ఇచ్చిన వాళ్ల బాధలు భరించలేక తనువు చాలిస్తున్నారు. తాజాగా ఈ అప్పు అనే భూతం నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రుణ బాధ భరించలేక పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..?

family suicide
అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య
author img

By

Published : May 31, 2022, 9:04 AM IST

FAMILY SUICIDE: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ కుటుంబం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదిభట్ల పరిధిలోని కూర్మల్​గూడలో జరిగింది. మృతులు కుద్దుస్ పాషా (37), ఫాతిమా (28), మెహర్ (9), ఫిర్దోషు భేగం(6)గా గుర్తించారు. వీరి కుటుంబం హైదరాబాద్​లోని సంతోశ్​నగర్​లో ఉంటున్నట్లు తెలిపారు.

అయితే రాత్రి పురుగుల మందు తాగి చెరువులో దూకినట్లు ప్రాథమికంగా సమాచారం ఆధారంగా తెలుస్తోంది. తెల్లవారేసరికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువులో తేలాయి. సమాచారం అందుకున్న డీఆర్​ఎఫ్, పోలీసు బృందాలు చెరువు వద్దకు చేరుకుని నలుగురి మృతదేహాలను వెలికితీశారు. కుద్దుస్ పాషా ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కుద్దుస్ పాషా తన బామ్మర్ది హమీద్​ను రాత్రి పదివేల రూపాయలు అడిగాడని చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.