ETV Bharat / city

Fear Of Corona Virus: ప్రాణం తీసిన కరోనా భయం.. కుటుంబం ఏం చేసిందంటే?

పాలలో నల్లఉప్పు, పసుపు కలుపుకొని తాగితే కరోనా సోకదని చెప్పిన మాటలు విన్న ఓ కుటుంబం... ఆ కషాయాన్ని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. మొత్తం ముగ్గురు తాగగా... ఇందులో ఒకరు చనిపోయారు.

a-family-drank-black-salt-in-milk-to-prevent-corona-and-one-man-died-in-this-incident
ప్రాణం తీసిన కరోనా భయం.. పాలలో నల్లఉప్పు కలుపుకొని తాగిన కుటుంబం
author img

By

Published : Nov 13, 2021, 12:25 PM IST

కరోనా భయం (Fear Of Corona Virus) ఇప్పట్లో తగ్గేలా లేదు. పాలలో నల్లఉప్పు, పసుపు కలుపుకొని తాగితే కరోనా (Fear Of Corona Virus) రాదని చెప్పిన ఇతరుల మాటలు విన్న ఓ కుటుంబం.. తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంది. వీరిలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు. హైదరాబాద్​ మచ్చబొల్లారం చంద్రనగర్ కాలనీలో నివసించే నరేశ్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పాలలో నల్లఉప్పు, పసుపు కలిపి తాగితే.. కరోనా (Fear Of Corona Virus) రాదనే ఇతరుల మాటలు నమ్మాడు.

ఇంటికి వచ్చి.. తల్లి లక్ష్మి, భార్యతో ఈ విషయం చెప్పాడు. పాలలో నల్లఉప్పు, పసుపు కలుపుకొని తాగితే.. అనారోగ్యం రాదు, కరోనా (Fear Of Corona Virus) కూడా రాదని చెప్పి నమ్మించాడు. ముగ్గురు కలిసి ఆ మిశ్రమాన్ని తాగారు. 20 నిమిషాల తర్వాత ముగ్గురు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్ కుమార్ మృతి చెందగా.. తల్లి, భార్య చికిత్స పొందుతున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: covid regulations: కొవిడ్‌ నిబంధనలకు అడుగడుగునా తూట్లు

No mask : నో మాస్క్​, నో శానిటైజర్​... మరో ముప్పు తప్పదా?

India covid cases: దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు

దేశంలో 80 శాతం మందికి మొదటి డోసు పూర్తి

ఆ దేశాల్లో మళ్లీ కరోనా భయం.. వేగంగా ఆస్పత్రుల నిర్మాణం.. త్వరలో లాక్​డౌన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.