ETV Bharat / city

Jagtial News: రాత్రంతా శవానికి పూజలు.. ఇక బతికిరాడని చివరికి ఏం చేశారో తెలుసా?

చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేసిన ఘటన శుక్రవారం రోజున తెలంగాణలోని జగిత్యాల జిల్లా టీఆర్​నగర్​లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పూజలు చేసిన వ్యక్తితో పాటు అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతిచెంది 24 గంటలు దాటటంతో ఆ మృతదేహం నుంచి దుర్వాసన వస్తోంది. రాత్రంతా శవానికి పూజలు చేసిన కుటుంబీకులు.. ఇక అతడు తిరిగి రాడని అర్థమై.. ఖననం చేసేందుకు నిర్ణయించారు.

రాత్రంతా శవానికి పూజలు
రాత్రంతా శవానికి పూజలు
author img

By

Published : Aug 14, 2021, 12:43 PM IST

ప్రపంచమంతా గ్లోబల్‌ విలేజ్‌గా మారినా .. కొందరు మూఢ నమ్మకాలపై అపోహలు మాత్రం వీడటం లేదు. తెలంగాణలోని జగిత్యాల టీఆర్‌ నగర్‌లో.. చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ శవం దగ్గర పూజలు చేసిన సంఘటన తెలిసిందే. పూజలు చేసిన వ్యక్తిని, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయి 24 గంటలు దాటడంతో మృతదేహం నుంచి దుర్వాసన వస్తోంది. నిన్న.. అంత్యక్రియలకు అంగీకరించిన కుటుంబ సభ్యులు.. దుర్వాసన రావడం వల్ల నేడు ఖననం చేయడానికి అంగీకరించారు. కాసేపట్లో మృతుడికి దహనసంస్కారాలు నిర్వహించనున్నారు.

అసలేం జరిగిందంటే..

తెలంగాణలోని జగిత్యాల రూరల్‌ మండలం టీఆర్‌ నగర్‌లో ఓర్సు రమేష్‌ మృతి చెందాడు. మంత్రాల కారణంగానే రమేష్ మృతి చెందాడని.. పుల్లేశ్ అనే వ్యక్తిని బాధిత కుటుంబ సభ్యులు చితక బాదారు. తానే మంత్రాలతో రమేష్‌ని చంపానని, మంత్రాలతో మళ్లీ బతికిస్తానంటూ ఉదయం నుంచి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పుల్లేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌ మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.

మృతుడి కుటుంబీకులు మాత్రం వారి మూఢనమ్మకాన్ని వీడలేదు. పుల్లయ్యను విడుదల చేయాలంటూ ఆందోళన చేశారు. అతడు రమేష్​ను బతికిస్తాడంటూ పోలీసులతో గొడవపడ్డారు. అతడు మృతి చెందాడని.. తిరిగి బతకడని పోలీసులు ఎంతచెప్పినా వారు వినలేదు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించమని చెప్పినా పట్టించుకోలేదు.

శవాన్ని రాత్రంతా అలాగే ఉంచారు. రమేష్ మృతిచెంది 24 గంటలు కావడం వల్ల మృతదేహం నుంచి దుర్వాసన రావడం ప్రారంభమైంది. ఇక అతడు తిరిగి రాలేడని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు ఎట్టకేలకు.. శవాన్ని ఖననం చేసేందుకు అంగీకరించారు. కాసేపట్లో అతడి స్వగ్రామంలో దహనసంస్కారాలు నిర్వహించనున్నారు.

  • ఇదీ చదవండి:

సీబీఐ విచారణకు హాజరైన ఉదయ్​కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.