- సింధుకు కాంస్యం
టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు మెరిసింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటింది. చైనాకు చెందిన బింగ్జియావోపై ఆది నుంచీ దూకుడుగా ఆడిన సింధు.. తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ నుంచే సింధు ఆధిపత్యం కొనసాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు, ఎల్లుండి నిరసనలు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి, విశాఖ ఉక్కు కార్మికులు ప్రైవేటీకరణ నుంచి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి.. పార్లమెంట్ సమావేశాల సమయంలో జంతర్ మంతర్ వద్ద రేపు మహా నిరసన తెలియజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డీజీపీకి చంద్రబాబు లేఖ
డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో జూన్ 17న నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. సాక్షుల్ని బెదిరిస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని లేఖలో కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొడుకు పెంచి పెద్దది చేస్తున్నారు
కొండపల్లిలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తండ్రి బీజం వేస్తే కుమారుడు పెంచి పెద్దది చేస్తున్నారని ఎద్దేవాచేశారు. తెదేపా ప్రభుత్వంలో హైకోర్టు తీర్పునకు లోబడి 2017లో అప్పటి సీఎం చంద్రబాబు మైనింగ్ లీజులన్నీ రద్దు చేశారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇద్దరు పిల్లలతో సహా..
గోదావరిలో దూకి ఓ కుటుంబం తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వంతెన వద్ద దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకారు. తూర్పు గోదావరిజిల్లా మామిడికుదురుకు చెందిన సతీష్, సంధ్య.. తమ ఇద్దరు పిల్లలైన నాలుగేళ్ల జస్విన్, రెండేళ్ల బిందుతో కలిసి.. శనివారం పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం విచారణ
దేశంలో దుమారం రేపిన పెగసస్ వ్యవహారంపై ఆగస్టు 5న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి పెగసస్‌ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను విచారించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉత్తరాదిలో భారీ వర్షాలు
ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాది చిగురుటాకులా వణికిపోతోంది. దిల్లీలో రహదారులు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజస్థాన్‌లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సరిహద్దు వివాదం ముగిసేనా?
అసోం-మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తకరం వాతావరణం నెలకొన్న వేళ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మేరకు వారితో ఆయన ఫోన్లో సంభాషించారు. కాగా, అంతకుముందే అసోం సీఎంపై ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకుంటామని మిజోరం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్ చేతికి పగ్గాలు
ఆగస్టు నెలకుగాను ఐరాస భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఫ్రాన్స్ నుంచి ఈ బాధ్యతలను ఆదివారమే భారత్ స్వీకరించింది. భారత్ తన అధ్యక్ష హయాంలో.. శాంతి పరిరక్షణ దిశగా వివిధ దేశాలతో పలు కీలక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ వారం విడుదల కానున్న సినిమాలివే..
సినీ అభిమానుల్ని అలరించేందుకు ఓటీటీలో ఈ వారం(ఆగస్టు 1-6)లో సరికొత్త సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. అందులో 'నవరస' వెబ్‌సిరీస్ సహా అనేక చిత్రాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఏ ఓటీటీ యాప్‌లో రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.