- మహారాష్ట్ర సీఎంగా శిందే ప్రమాణం..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు.
- రాష్ట్రంలో రేపట్నుంచి ఛార్జీల బాదుడు..
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంపు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ విధించారు.
- పీఎస్ఎల్వీ సీ53 మిషన్ ప్రయోగం విజయవంతం
పీఎస్ఎల్వీ సీ-53 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది.
- 'అధికారులు పిట్ట కథలు చెబుతున్నారు'
జీపీఎఫ్‌లో సొమ్ము మళ్లింపుపై న్యాయపోరాటం చేస్తామని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ పేర్కొన్నారు. సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసి జీపీఎఫ్‌లో డబ్బులు డెబిట్ కావడంపై వివరణ కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఏమయ్యాయంటే.. పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు.
- మృత్యువు దొంగ దెబ్బ.. ఐదుగురు సజీవ దహనం!
పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్న కూలీలను మృత్యువు దొంగ దెబ్బ తీసింది. వాళ్లను విద్యుత్ వైర్లు మృత్యురూపంలో కబలించాయి. వారు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడి మంటలు చెలరేగగా.. ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషాదకర ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది.
- 'ఎంఎస్ఎంఈలకు 8 ఏళ్లలో 650% పెరిగిన కేటాయింపులు'
ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని గుర్తు చేశారు.
- 'కరోనా ముగియలేదు.. దాన్ని కనిపెట్టడం కష్టమే!'
కరోనా వైరస్ సమస్య ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. వైరస్ కొత్త రూపంలో దాడి చేస్తోందని వెల్లడించింది. వైరస్‌ను ట్రాక్ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉందని పేర్కొంది.
- జులై 1 నుంచి క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్.. కస్టమర్లకే బెనిఫిట్!
కొత్త క్రెడిట్ కార్డుల జారీ, ప్రస్తుతమున్న కార్డుల అప్‌గ్రేడ్ విషయంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బిల్లింగ్ తేదీలు, క్రెడిట్ కార్డుల క్లోజింగ్ విషయంలోనూ మార్పులు చేసింది. వినియోగదారులకు మేలు చేసేలా ఉన్న ఈ మార్గదర్శకాలేంటి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
- సింధు ఈజ్ బ్యాక్.. మలేసియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ఎంట్రీ
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేసియా ఓపెన్‌లో మంచి ప్రదర్శన చేస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణిపై నెగ్గి.. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కూడా మరో అడుగు ముందుకేశాడు.
- హ్యాట్రిక్‌కు సిద్ధమైన 'లైగర్' కాంబో..! ఒటీటీలో 'మేజర్' ఎప్పుడంటే?
కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఇప్పటికే 'లైగర్', 'జనగణమన' చిత్రాలు చేస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. త్వరలోనే మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న అడివి శేష్ 'మేజర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
9pm Top news