- ఎలా తొలగిస్తారు?
నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులిచ్చింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- అసలేం జరిగింది..?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగవని హితవు పలికింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- న్యాయవాదుల రాజీనామా!
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు ముగ్గురు.. ఒకేసారి రాజీనామా చేశారు. పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్.. విధుల నుంచి ఒకేసారి తప్పుకొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వైకాపా గూటికి శిద్దా
తెదేపాకు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు వైకాపా గూటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. . పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'చేదోడు కాదది.. జగన్మాయ పథకం'
రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. చేదోడు పథకం మరో మాయా పథకమన్న ఆయన.. గతంలో అందరికీ వర్తింప చేస్తామని చెప్పి.. ఇప్పుడు పరిమితి విధిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రెమ్‌డెసివిర్‌పై ఆశలు
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొనటంలో పలు దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసిన 'రెమ్‌డెసివిర్' అనే ఔషధం.. కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- సీఎంను అందుకే కలవలేదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సినీపెద్దలు నిర్వహించిన సమావేశానికి తనను పిలవకపోవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తనకు మర్యాద ఇవ్వకపోవడం వల్లే తాను అలా మాట్లాడినట్లు చెప్పారు బాలకృష్ణ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇక ఆగలేము
సెట్లో అడుగుపెట్టడానికి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లు దర్శకధీరుడు రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు జక్కన్న. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- అభిమానులకు షాక్
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు, దాదాపు అన్ని ప్రఖ్యాత ట్రోఫీలను ముద్దాడిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులు ట్విట్టర్ ట్రెండింగ్ వార్తలను చూసి షాకయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
- 'చెక్‌బౌన్స్'కు మినహాయింపు!
కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం పలు కీలక ప్రతిపాదనలు చేసింది. సులభతర వాణిజ్యానికి ఊతమిచ్చేలా 19 చట్టాల్లోని చెక్‌బౌన్స్ వంటి చిన్నపాటి తప్పిదాలను క్రిమినల్ చర్యల నుంచి మినహాయించాలని భావిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.