- జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము విత్ డ్రా.. ఎలా జరిగిందో తెలియదన్న ఆర్థిక శాఖ!
ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటన పై ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా కావడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు. దీనికి.. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదని ఆర్థికశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు.
- ఉద్యోగులకు ఉచితవసతి మరో 2 నెలలు పొడిగింపు
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతిని సర్కార్ మరో రెండు నెలలు పొడిగించింది. ఉచిత వసతి గడువు ముగుస్తుండటంతో రేపటిలోపు ప్రతి ఉద్యోగి ఉచిత వసతిని ఖాళీ చేయాలని ఈ ఉదయం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఉచిత వసతిని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.
- రాఘురామపై విచారణకు హైకోర్టు అనుమతి
ఎంపీ రాఘురామకృష్ణంరాజుపై నమోదైన రాజద్రోహం కేసు మినహా ఇతర కేసుల్లో సీఐడీ అధికారులు విచారించుకోచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని దిల్ కుశ గెస్ట్ హౌస్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని.. న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారణ జరగాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
- మదనపల్లి తర్వాతే గుడివాడలో మహానాడు
వచ్చే నెల 6, 7, 8వ తేదీల్లో రాయలసీమలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన యథాతథంగా కొనసాగనుంది. మహానాడు నిర్వహణపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కృష్ణా జిల్లా , మదనపల్లి నేతలతో సమీక్ష నిర్వహించారు. మదనపల్లి తర్వాత గుడివాడలో మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.
- బలపరీక్షకు గవర్నర్ ఆదేశాలు.. సుప్రీంకు శివసేన
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బలపరీక్ష నిరూపణను వాయిదా వేసేందుకు న్యాయ మార్గాలను అన్వేషిస్తోంది 'అఘాడీ' కూటమి. ఈ నేపథ్యంలో బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
- 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దర్జీ హత్య'.. భాజపా ఆరోపణ.. కాంగ్రెస్ 'రాజ ధర్మం' కౌంటర్
ఉదయ్పుర్లో జరిగిన కన్హయ్య లాల్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యను ముక్తకఠంతో ఖండిస్తున్నారు. విపక్షాలు మాత్రం.. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే హత్యకు కారణమని విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీకి సీఎం గహ్లోత్ పిలుపునిచ్చారు.
- అక్కడ 'పానీపూరీ' బ్యాన్.. ఆ ప్రాణాంతక వ్యాధే కారణం!
వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం విధించారు అధికారులు. నిషేధిత జాబితాలో ఎక్కువమంది అమితంగా ఇష్టపడే పానీపూరీతో పాటు పలు ఇతర ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎందుకు, ఎక్కడ బ్యాన్ చేశారంటే?
- పరిహారం కొనసాగింపుపై ఎటూ తేల్చని జీఎస్టీ మండలి
చండీగఢ్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. రాష్ట్రాల డిమాండ్‌పై ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఈ భేటీలో భాగంగా రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపు అంశం అజెండాలో ఉన్నప్పటికీ దానిపై మండలి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ మేరకు పుదుచ్చేరి ఆర్థిక మంత్రి కె.లక్ష్మీనారాయణన్ మీడియాకు తెలిపారు.
- బూమ్రాకు భారత క్రికెట్ టెస్టు జట్టు పగ్గాలు
కరోనా బారిన పడి ఇంకా కోలుకోని రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో(రీషెడ్యూల్) టెస్టుకు దూరం కానున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. తాత్కాలిక కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించనున్నాడని అన్నారు.
- ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతల కీలక నిర్ణయం..
ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయని చెప్పారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - LATEST NEWS UPDATES IN AP
.
top news of ap