ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు9am

author img

By

Published : Aug 17, 2022, 8:59 AM IST

.

ap topnews
ప్రధానవార్తలు9am

  • కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టుల నిర్మాణం

రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. నిధులు కేటాయించక, నిర్మాణ పనులు జరక్క నత్తతో పోటీపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రాధాన్యత క్రమంలో ప్రకటించిన 42 ప్రాజెక్టుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రాధాన్య జాబితాలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంట్లోకి వెళ్లకముందే వడ్డీ మోత

టిడ్కో గృహాల విషయంలో ప్రభుత్వ జాప్యం లబ్ధిదారులకు పెనుభారంగా మారుతోంది. లబ్ధిదారుల పేరుతో బ్యాంకులు అందించిన రుణంపై వడ్డీ కొండలా పేరుకుపోతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండేళ్ల గడువు తీరకుండానే వడ్డీ కట్టాలని లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇటు అద్దె, అటు వడ్డీ రెండూ చెల్లించలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోబోమంటూ ఉపాధ్యాయుల లేఖల సమర్పణ

రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ ఆధారిత హాజరు నమోదుపై ఉపాధ్యాయులు సహాయ నిరాకరణ ప్రకటించారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోబోమంటూ అనేక మంది ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. ప్రభుత్వం డివైజ్‌, డేటా అందిస్తేనే హాజరు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్న సీఎం జగన్​

ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినప్పుడే పేదరికం నుంచి బయటపడటంతో పాటు.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు. మూతపడిన ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది

ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలోని బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టు ​మార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మూ మెడికల్​ కాలేజ్​కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు

మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పగా 50 మందికిపైగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే 500 కోట్ల మంది ప్రాణాలు గాల్లోకి

అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా-రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన తేల్చింది. ఈ యుద్ధం వల్ల సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ ఏడాది వేతనాల్లో 10% పెంపు, ఆసియా పసిఫిక్​లోనే అత్యధికం

ఆసియా పసిఫిక్​లోనే అత్యధిక వేతనాలు చెల్లించే దేశంగా భారత్​ నిలవబోతుంది. భారత్‌లోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 10 శాతం మేర వేతన పెంపును చేపట్టవచ్చని అంతర్జాతీయ సలహా, బ్రోకరేజీ కంపెనీ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ చేపట్టిన శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ నివేదిక అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత ఫుట్‌బాల్‌పై పెద్ద బాంబు, ప్రపంచకప్‌ ఆతిథ్యానికి దూరం

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ భారత ఫుట్‌బాల్‌పై పెద్ద బాంబు పడింది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను ఫిఫా నిషేధించింది. ఇది దేశ ఫుట్‌బాల్‌కు తీరని మచ్చగా మిగిలిపోనుంది. ఓ వైపు గత స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆటలో ఘన కీర్తిని సాధించాలనే ప్రతిజ్ఞలు హోరెత్తుతున్న వేళ.. ఈ పరిణామం దేశ క్రీడా రంగానికి పెద్ద షాక్‌. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉత్కంఠగా హైవే ట్రైలర్, శర్వానంద్​ మూవీ నుంచి కొత్త పాట

ఆనంద్‌ దేవరకొండ, మానస జంటగా కె.వి.గుహన్‌ తెరకెక్కించిన హైవే చిత్రానికి సంబంధించిన ట్రైలర్​ను హీరో నాగశౌర్య విడుదల చేశారు. మరోవైపు, హీరో శర్వానంద్​, రీతూ వర్మ జంటగా రూపొందిన ఒకే ఒక జీవితం సినిమా నుంచి కొత్త పాట రిలీజ్​ చేశారు మేకర్స. వాటితో పాటు మరికొన్ని కొత్త సినీ అప్డేట్లు మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.