- జడ్జిల నియామకంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో జరిగిన లావు వెంకటేశ్వర్లు 5వ స్మారక ఉపన్యాస సభకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ - భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు బిల్లుల మోత
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. నిర్వాహణకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు వీటికే వెచ్చించాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాజీ మంత్రి దేవినేని కుటుంబానికి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శ
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శించారు. ఇటీవల దేవినేని ఉమ తండ్రి శ్రీమన్నారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ ఇంటికి వెళ్లిన సీజేఐ.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు తిరస్కరించారు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారిద్దరికి ఇది వరకే వేర్వేరుగా పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు..! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ అందుకే..'
స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టత ఇచ్చారు. భారత్‌పై దుష్ట కన్ను పడకుండా నివారించేందుకే క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తమిళనాడులో రూ. 23కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో తమిళనాడు వ్యాప్తంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో రూ. 23కోట్లు విలువగల హెరాయిన్, రూ. 4.2కోట్లు విలువ చేసే కుట్కా, రూ. 18కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన 27 మృతదేహాలు
ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు సహా మొత్తం 27 మంది మృతదేహాలు.. సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మృతులంతా ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వలసదారులుగా తెలుస్తోంది. లిబియాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 2031 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
10ఏళ్లల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని సీఈబీఆర్ తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ఫ్రాన్స్‌ను అధిగమించి ఆరో స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కెప్టెన్సీ వ్యవహారం.. వారిద్దరికీ వరంగా మారొచ్చు'
కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైనదే అని అన్నాడు టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి. ఇలా చేయడం విరాట్, రోహిత్‌కు వరంగా మారే అవకాశముందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నటి సన్నీ లియోనీకి మంత్రి వార్నింగ్
సన్నీ లియోనీ 'మధుబన్' వివాదం ముదిరింది. సన్నీకి ఓ మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో సదరు సంగీత సంస్థ పాటలో మార్పునకు అంగీకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.