- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్ధం
విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ల్యాడిల్కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.
- నేడు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రభుత్వం తేనీటి విందు
CJI JUSTICE NV.RAMANA: నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హాజరవుతారు. ఈ విందులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రులను సీజేఐ, జడ్జిలకు పరిచయం చేయనున్నారు.
- Theatres Closing In AP: సినిమా థియేటర్లలో తనిఖీలు.. 30 హాళ్లు సీజ్
రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు.
- కేంద్రమంత్రిని కలిసేందుకు వెళ్లిన మహిళలపై భాజపా కార్యకర్తల దాడి!
ఉత్తర్‌ప్రదేశ్ జైసలో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి తమ ప్రాంతంలో ఉన్న నీటి సమస్యలను వివరించేందుకు వెళ్లిన మహిళలపై దాడి జరిగింది. భాజపా కార్యకర్తలు, జైస మున్సిపల్ అధ్యక్షుడు, ఆయన తనయుడు తమపై దాడి చేశారని మహిళలు ఆరోపించారు.
- దేశంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
దేశంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచే చర్చిలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో చర్చిలను మూసివేశారు. మహారాష్ట్రలోనూ ఆంక్షల మధ్యే క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
- Loans for babies: పిల్లల్ని కంటే రూ. 25 లక్షల రుణం.. చైనా కొత్త రూల్!
Loans for babies: జనాభాను పెంచుకోవడమే లక్ష్యంగా చైనా పలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా వివాహమైన దంపతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు జిలిన్ ప్రావిన్సు సిద్ధమైంది. ఒక్కో జంటకు రూ. 25 లక్షలు రుణం ఇప్పించే ప్రతిపాదన రూపొందించింది.
- విపులంగా విశ్వవీక్షణం- వీడనున్న ఖగోళ గుట్టు!
ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు, అంతుచిక్కకుండా ఉన్న అనేక ప్రశ్నలకు జవాబులు కనుగొనేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపును శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. కాలంలో వెనక్కి వెళ్లి.. విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను శోధించడం దీని ప్రత్యేకత. హబుల్ టెలిస్కోపు వారసురాలిగా భావిస్తున్న దీన్ని.. శనివారం సాయంత్రం ప్రయోగించనున్నారు.
- Stock Limits on Soyameal: సోయామీల్ నిల్వపై పరిమితులు
Stock Limits on Soyameal: సోయామీల్ నిల్వలపై పరిమితులు విధించింది కేంద్రం. 2022 జూన్ వరకు ఈ పరిమితులు కొనసాగుతాయని పేర్కొంది. ధరల అదుపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
- 'దూస్రా కింగ్'ను చూస్తే దిగ్గజాలకే హడల్
ఆఫ్ సైడ్‌కు వెళ్లిపోతుందిలే అని వదిలేసిన బంతి ఉన్నట్టుండి టర్న్ తీసుకుని బెయిల్స్‌ను ఎగరేసేది.. నెమ్మదిగా వస్తున్నట్లే కనిపించే బంతి సర్రున దూసుకొచ్చి వికెట్లను కూలదోసేది..! ఫ్లయిటెడ్ డెలివరీయే కదా అని ముందుకెళితే బంతి బ్యాట్ ప్యాడ్ మధ్య దూరిపోయేది! ఇలా బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెట్టి వికెట్ల పంట పండించుకున్న బౌలరే హర్భజన్ సింగ్.. ది టర్బోనేటర్!
- 83 movie: 'నిజమైన దేశభక్తి అంటే ఏంటో '83'లో చూస్తారు'
జాతీయత వేరు దేశభక్తి వేరు అంటున్నారు దర్శకుడు కబీర్ ఖాన్. ఈయన దర్శకత్వం వహించిన '83' ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 1983 ప్రపంచ కప్ విజయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నేపథ్యంలో నిజమైన దేశభక్తి అంటే ఏంటో '83'లో చూస్తారని కబీర్ ఖాన్ అన్నారు.