- పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
రాష్ట్రంలో మరోసారి.. వరుస ఎన్నికల హడావిడి మొదలైంది. పలు కారణాలతో ఎన్నిక జరగకుండా మిగిలిపోయిన పంచాయతీ, మునిసిపల్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం పలు మునిసిపల్, పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. మిగిలిపోయిన పరిషత్ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 700వ రోజుకు అమరావతి మహోద్యమం.. 16వ రోజుకు మహాపాదయాత్ర!
రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన మహోద్యమం 700వ రోజుకు చేరింది. దీంతో.. మహాపాదయాత్ర(maha padayatra)లో భాగంగా నేడు రైతులు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '3 రాజధానుల మాటే వద్దు.. ఆ ప్లాన్‌ను మార్చొద్దు'
రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ ప్రారంభమైంది. అమరావతి ‘మాస్టర్ ప్లాన్’ను మార్చడానికి వీల్లేదని రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధానిని మార్చితే భూములిచ్చిన రైతుల హక్కులను హరించినట్లే అని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తేమొచ్చిందని ఆరబెడితే మెలకలు.. వానొస్తుందని కప్పేస్తే రంగులో మార్పు..!
చేతికొచ్చిన పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షం వస్తోంది కదా అని కప్పేస్తే.. తేమతో మొలకలు వచ్చేస్తున్నాయి. అలా అని ధాన్యాన్ని ఆరబెడితే.. వానకు తడిసిపోయి రంగుమారిపోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడు!
దిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తిగా.. సీనియర్ న్యాయవాది సౌరబ్ కిర్పాలన్ పేరును సిఫార్సు చేసింది జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కొవాగ్జిన్‌తో 6 నెలల పాటు రోగనిరోధక జ్ఞాపకశక్తి'
కొవాగ్జిన్ టీకా తీసుకుంటే కొవిడ్-19 కారక సార్స్‌కోవ్-2 వైరస్‌కు సంబంధించిన రోగనిరోధక జ్ఞాపకశక్తి కనీసం ఆరు నెలల వరకు ఉంటున్నట్లు ఎన్‌ఐఐ డైరెక్టర్ పుష్కర్‌శర్మ తెలిపారు. అందువల్ల ఈ టీకా నుంచి కనీసం ఆరు నెలల వరకు రక్షణ లభిస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆస్ట్రేలియాలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
ఆస్ట్రేలియా మెల్బోర్న్ శివారులో గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని స్కాట్ మారిసన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూలధన వ్యయం పెంచండి: నిర్మలా సీతారామన్
నవంబర్ నెలలో పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సి మొత్తాన్ని రెట్టింపు చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ తెలిపారు. ఈ నెల 22న ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్.. టైటిల్‌పై సింధు గురి
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ 750 నేటి(నవంబరు 16) నుంచి ప్రారంభంకానున్నాయి(indonesia masters 2021). ఇటీవలే జరిగిన డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గలేకపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీలోనైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కీర్తిసురేశ్ 'గుడ్‌లక్ సఖి' మరోసారి వాయిదా.. ఈసారి అయినా..?
కీర్తి సురేశ్ 'గుడ్‌లక్ సఖి' సినిమాకు రిలీజ్ కష్టాలు తప్పడం లేదు. వరుసగా విడుదల తేదీలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా కొత్త డేట్‌ను ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.