- కార్తికస్నానంలో విషాదం.. గల్లంతైన ముగ్గురు యువకులు
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద కృష్ణా నదిలో విషాదం చోటుచేసుకుంది. కార్తికస్నానం కోసం వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
- శివోహం.. రుద్రాభిషేకం.. భక్తులతో పోటెత్తిన శివాలయాలు
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
- tirumala: శ్రీవారిలో సేవలో కర్ణాటక సీఎం, పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి హోంమంత్రి, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
- Air Pollution: ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం
వాయు కాలుష్యంతో(Air Pollution) తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ- వాయు నాణ్యత మార్గదర్శకాలను 2021లో సవరించింది. వాయు కాలుష్య(Air Pollution news) ప్రమాణాలను కఠినతరం చేసింది. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలు- ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాముల కంటే ఎక్కువ స్థాయిలో ఉండకూడదన్నది తాజా ప్రమాణం.
- Defence ministry: 'అగస్టా వెస్ట్‌లాండ్'పై నిషేధం ఎత్తివేత
ఇటలీకి చెందిన హెలికాప్టర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్(Agustawestland case), దాని మాతృసంస్థ లియోనార్డో కంపెనీలపై గతంలో విధించిన నిషేధాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ తొలగించింది. 2014 నాటి ఒప్పందం రద్దుకు పరిహారం చెల్లించాలంటూ ఇన్నాళ్లుగా భారత్‌ను కోరుతున్న లియోనార్డో కంపెనీ.. ఆ దావాను ఉపసంహరించుకున్న నేపథ్యంలో నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
- ప్రముఖ రచయిత బాబాసాహెబ్ పురందరే కన్నుమూత
ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత శివ్శాహిర్ బాబాసాహెబ్ పురందరే(Shivshahir babasaheb purandare) కన్నుమూశారు. మహారాష్ట్ర పుణెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
- Taliban News: 'భారత్‌తో సత్సంబంధాలే కోరుకుంటున్నాం'
అఫ్గానిస్థాన్‌లో(Afghanistan News) తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ రంగాల నుంచి మహిళలను దూరం చేస్తున్నారన్న వార్తలను తోసిపుచ్చారు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. భారత్ సహా ఏ ఇతర దేశంతోనూ తాము విరోధం కోరుకోవడంలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
- Piyush goyal: 'రికార్డ్ స్థాయి ఎగుమతుల దిశగా భారత్'
అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను కొనసాగించడంలో భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్(Piyush goyal) పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని, దేశ వస్తు సేవల ఎగుమతులు రికార్డు గరిష్ఠాలకు చేరే క్రమంలో ఉన్నాయని తెలిపారు.