- 11th day: అడ్డుకులు అధిగమిస్తూ.. నిర్బంధాలను సవాల్ చేస్తూ.. జ్వలిస్తున్న మహాపాదయాత్ర!
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర(amaravati farmers maha Padayathra ) ఉధృతంగా ముందుకు సాగుతోంది. గురువారానికి పదకొండో రోజుకు చేరిన యాత్ర.. నేడు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MLA'S HOUSE ARREST: మహా పాదయాత్రలో పాల్గొనకుండా.. తెదేపా ఎమ్మెల్యేల గృహనిర్బంధం
అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొనకుండా ప్రకాశం జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం(mla's house arrest at prakasam district) చేశారు. చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్టూరులో ఏలూరి సాంబశివరావు అరెస్టు(mla's house arrest at prakasam district due to maha padayatra) చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- PPA MEETING: పోలవరంపై ఢీ....ఫైలు పంపకుంటే పెట్టుబడి వచ్చేదెలా?
పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపకుండా మీ దగ్గరే ఉంచుకుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులను నిలదీశారు. అడిగిన సమాచారం ఇస్తేనే కదా మేం పంపేది అని అథారిటీ అధికారులు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ASSEMBLY SESSION : ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తమిళనాడును వదలని వర్షాలు.. 12కి చేరిన మృతులు
తమిళనాడులో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నవంబర్ 10, 11 తేదీల్లో సెలవును ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మతహింస లావాలాంటిది.. నేనూ అల్లర్ల బాధితుడినే'
మత కల్లోలాలు వ్యవస్థీకృతమైన హింస వంటివని పేర్కొన్నారు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. మత హింసను లావాతో పోల్చారు. లావా నేలపై పారినప్పుడు అది మంటతో పాటు, మరకను మిగుల్చుతుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంతర్జాతీయ సౌరకూటమిలోకి అమెరికా
అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) లో అమెరికా చేరడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సౌర శక్తిని వినియోగించుకునే భాగస్వామ్య అన్వేషణలో అమెరికా చేరడం కూటమిని మరింత బలోపేతం చేసిందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐటీ నిపుణులకు గిరాకీ- అధిక జీతాలిచ్చేందుకు కంపెనీలు సిద్ధం!
ఐటీ రంగంలో ఉద్యోగ ప్రకటన(software developer jobs) వచ్చిన 2 నెలలకు కూడా అభ్యర్థులు దొరకడం కష్టంగా మారినట్లు ఉద్యోగాల వెబ్‌సైట్ 'ఇండీడ్' పేర్కొంది. సపోర్ట్ ఎస్కలేషన్ ఇంజినీర్ బిజినెస్ ఆబ్టెక్ట్స్ డెవలపర్, మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇంజినీర్ అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజినీర్ వంటి పోస్టులకు గిరాకీ పెరిగిందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆటగాళ్ల విశ్రాంతి.. ఇక బీసీసీఐ చేతుల్లో!
ఇకపై ఆటగాళ్లపై ఒత్తిడిని గమనించి బీసీసీఐ(bcci news) వారికి విశ్రాంతిని ఇవ్వనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్య 'అఖండ' రిలీజ్ డేట్ ఫిక్స్!
బాలయ్య 'అఖండ' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబరు తొలి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.