ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - తెలుగు వార్తలు

.

9am top news
ప్రధాన వార్తలు @ 9 AM
author img

By

Published : Aug 27, 2021, 9:01 AM IST

  • ప్రభుత్వం ఉత్తర్వులు

హెచ్చార్సీ కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టులో వాదనలు జరగ్గా.. మానవ హక్కుల కార్యాలయం ఎక్కడ పెట్టాలనే దానిపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విస్తుపోయే నిజాలు

రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచే నకిలీ చలానాల కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న నిందితులు ప్రభుత్వానికి రావలసిన కోట్ల రూపాయల ఆదాయాన్ని తమ జేబులో వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోలుకుంటున్న ఆర్టీసీ

కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ క్రమంగా కోలుకుంటుంది. గతంతో పోల్చితే.. రోజువారి ఆదాయం పెరుగుతోంది. త్వరలో విద్యాసంస్థలు తెరిస్తే రాబడీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కలెక్టర్ బంగ్లాలో కూలిన పైకప్పు..

అనంతపురం కలెక్టర్‌ బంగ్లాలోని డ్రాయింగ్‌ రూమ్‌ పైకప్పు కూలింది. 150 ఏళ్లనాటి భవనం గది పైకప్పు నీటి నిల్వతో ఉంది. మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజద్రోహం కేసులా!

సర్కారు మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం.. దేశంలో ఇబ్బందికర పరిణామంగా మారిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు పోలీసులూ కారకులేనని సీజేఐ జస్టిస్‌ రమణ ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • త్వరగా 'పీఎం కేర్స్‌'

కొవిడ్(Covid-19)​ కాలంలో అనాథలైన బాలలను వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది సుప్రీం కోర్టు(Supreme court). 'పీఎం కేర్స్​ చిల్డ్రన్'​ (PM-CARES Fund)వీరికి సహాయం చేయాలని పేర్కొంది. ఈ విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సర ఫీజు రద్దు చేసేలా ప్రైవేటు పాఠశాలలతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉద్యమంగా రైతుల ఆందోళన'

రైతుల ఉద్యమాన్ని(Farmers Protest) దేశవ్యాప్తం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా భావిస్తోంది. వ్యవసాయ చట్టాలపై మాతో చర్చించడానికి ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా లేకపోవడం విచారకరమని, అంతమాత్రాన మనం నీరుగారిపోవాల్సిన అవసరం లేదని బీకేయూ నేత రాకేష్​ టికాయిత్ అన్నారు. సెప్టెంబరు 25న భారత్‌ బంద్‌ పాటించాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాంబు పేలుళ్లు- 72 మంది మృతి

కాబుల్‌ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు. బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్​

భారత రెజ్లర్లకు అండగా నిలిచేందుకు ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం ముందుకొచ్చింది. 2032 ఒలింపిక్స్​ వరకు భారత రెజ్లింగ్​కు స్పాన్సర్​గా వ్యవహరించేందుకు అంగీకారం తెలిపింది. ఇందుకోసం రూ.170 కోట్లు ఖర్చు పెట్టునుంది! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వివాహ భోజనంబు' సినిమా రివ్యూ

లాక్​డౌన్ నేపథ్య కథతో తీసిన 'వివాహ భోజనంబు' సినిమా.. ఓటీటీలో విడుదలైంది. అయితే చిత్రం ఎలా ఉంది? ఏయే అంశాలు ప్రేక్షకుల్ని నవ్వించాయి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.