ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM - breaking news

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : May 22, 2021, 9:01 AM IST

  • వందో రోజుకు చేరిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షలు

వాళ్లంతా ఆ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులు. ఎప్పట్లాగే విధులు నిర్వహిస్తుండగా గుండెల్లో గుబులు పుట్టించే వార్త. ఆ సంస్థని ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం ప్రకటనతో కార్మికులు, ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు వందో రోజుకు చేరుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆనందయ్య మందు..ఈరోజు బందు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్‌ శాఖ బృందం పరిశీలించింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు కృష్ణపట్నం వెళ్లిన బృందం మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ మందు పంపిణీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుపై శాస్త్రీయ నిర్థరణకు కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధన సంస్థకు చెందిన వైద్యుల బృందం ఎల్లుండి కృష్ణపట్నం రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పరిషత్‌ ఎన్నికలు రద్దు... తాజాగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీకి ఆదేశం

రాష్ట్రంలో ఏప్రిల్‌ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఏప్రిల్‌ 1న ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఆ నోటిఫికేషన్‌ విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తుపాను పొంచి ఉంది.. జాగ్రత్త!

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం... తుపాన్​గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం చెబుతున్నందున ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 2-డీజీ ఔషధం భారీ ఉత్పత్తికి సన్నాహాలు!

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డీజీ కొవిడ్‌ ఔషధం.. ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ ఔషధాల తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా చికిత్సలో 2-డీజీ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెప్పాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కేంద్రం తీరుపై 'సీరం' మండిపాటు- కారణమదే

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ) తీవ్ర స్థాయిలో మండిపడింది. అందుబాటులో ఉన్న టీకా నిల్వల వివరాలు తెలియకుండానే.. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి కేంద్రం వ్యాక్సినేషన్​ ప్రారంభించిందని ఆ సంస్థ కార్యనిర్వహక డైరెక్టర్​ విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • '2021 చివరికల్లా యువత మొత్తానికి టీకా'

2021 చివరికల్లా యువతకు వ్యాక్సినేషన్​ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ కట్టడి చర్యలపై ఆరా తీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొవిడ్ రోగులను క్షణాల్లో గుర్తిస్తున్న శునకాలు!

చెమట వాసన ద్వారా కొవిడ్ రోగులను క్షణాల్లో గుర్తిస్తున్నాయి శునకాలు. ఈ మేరకు కనైన్ డిటెక్టింగ్ స్క్వాడ్​ను మోహరించింది థాయ్​లాండ్ ప్రభుత్వం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పారా ఒలింపిక్స్​కు పలక్‌, పారుల్‌ జోడీ

భారత పారా బ్యాడ్మింటన్‌ మహిళల జోడీ.. పలక్‌ కోహ్లీ-పారుల్‌ పర్మార్‌ టోక్యో పారా ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ జోడీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'మైదాన్' ఓటీటీ రిలీజ్​పై నిర్మాతల క్లారిటీ

బాలీవుడ్​ నటుడు అజయ్​ దేవగణ్​ నటిస్తున్న 'మైదాన్'​ సినిమా ఓటీటీ వేదికగా పే పర్​ వ్యూ పద్ధతిలో విడుదల కానున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తమని స్పష్టం చేశారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేయడంపైనే తాము దృష్టి సారించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.