- నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు
ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టేందుకు సమ్మతి కోరుతూ... అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ లేఖ రాశారు. జడ్జిలపై ఆరోపణలతో లేఖ రాయడం, బహిర్గతం చేయడం వెనుక కుట్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభించిన తితిదే
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని తితిదే పునఃప్రారంభించింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెన్లను జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు మరుసటి రోజు తితిదే దర్శనాన్ని కల్పించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా నేపథ్యంలో కర్రల సమరం నిషేధం
కర్నూలు జిల్లాలో ఏటా విజయదశమి సందర్భంగా జరిగే కర్రల సమరాన్ని కరోనా నేపథ్యంలో ఈసారి అధికారులు నిషేధించారు. దేవరగట్టుకు వెళ్లే మార్గాలన్నీ మూసివేశారు. ఇవాళ రాత్రి జరిగే ఉత్సవానికి బయటి వారిని ఎవరినీ అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా సోకిందంటూ మహిళను వెలివేసిన గ్రామస్థులు
ఎందరో జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా.. చిత్తూరు జిల్లాలో ఓ మహిళకు నిలువ నీడ లేకుండా చేసింది. కొవిడ్ సోకిందన్న అనుమానంతో ఊరి ప్రజలు ఆమెను గ్రామం నుంచి బహిష్కరించారు. మండల అధికారులు కల్పించుకుని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఈ వారంలోనే భారత్-చైనా కమాండర్ల భేటీ'
భారత్- చైనా మధ్య 8వ రౌండ్ సైనిక చర్చలు ఈ వారంలో జరగనున్నాయి. సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఇరు దేశాలు చర్చించనున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ సర్కార్ చర్యలు
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్ అసెంబ్లీలో అక్టోబర్ 31న తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. రైతుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ చర్యను అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాజస్థాన్ భాజపా ప్రతినిధి రామ్‌లాల్ శర్మ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత సైనిక కమాండర్ల భేటీకి సర్వం సిద్ధం
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం కమాండర్ల భేటీకి సర్వం సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత ఆర్మీ ఉప అధిపతి, కమాండర్లు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటన
2+2 చర్చల కోసం అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత్‌కు విచ్చేయనున్నారు. మంగళవారం భేటీ జరగనుండగా.. ఇవాళ(సోమవారం) భారత్‌కు రానున్నారు. ఇండో పసిఫిక్‌లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్‌లో దుందుడుకు వైఖరిపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'స్టోక్స్, శాంసన్ బ్యాటింగ్‌ను చూస్తూ ఉండిపోయా'
బెన్ స్టోక్స్, సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ అందించి జట్టును గెలిపించడంపై హర్షం వ్యక్తం చేశాడు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. అబుదాబి వేదికగా ముంబయితో తలపడ్డ రాజస్థాన్ రాయల్స్.. భారీ లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలిచింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కాబోయే భర్తతో కాజల్.. ఫొటోలు వైరల్
నటి కాజల్ అగర్వాల్ తనకు కాబోయే భర్త గౌతమ్ కిచ్లూతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దసర పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు కాజల్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి