ETV Bharat / city

ప్రధాన వార్తలు @9AM - తెలుగు ప్రధాన వార్తలు

.

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Sep 11, 2020, 9:01 AM IST

  • నేడు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ప్రారంభం

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87.74 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యుల ఖాతాల్లో రూ.6,792.20 కోట్లు జమ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఈనాడు' తోడు... సాకారమైన గూడు

హుద్​హుద్ పెను తుపాను చేసిన గాయం ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది ఈ తుపాను. దీంతో నిలువ నీడ కోల్పోయిన బాధితులకు సిక్కోలు జిల్లాలో రామోజీ గ్రూప్ గృహాలను నిర్మించి ఇచ్చింది. పూరి గుడిసెల్లో జీవించే తమకు... మంచి ఇళ్లు ఇచ్చారంటూ లబ్ధిదారులు 'ఈనాడు'కు కృతజ్ఞతలు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాజధానిపై పార్లమెంటుకే అధికారం: చంద్రబాబు

ఆన్​లైన్​లో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరి, వైఫల్యాలను ఎండగట్టాలని తెదేపా అధినేత సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • శ్రీశైలంలో 7 గంటలకుపైగా క్రస్ట్‌ గేట్లపై నుంచి నీరు..!

శ్రీశైలంలో జాగ్రత్తలు, అప్రమత్తలు కొరవడ్డాయి. ఎగువ ప్రాంతాలనుంచి వరద ప్రవాహం అధికం కావడంతో నాలుగు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. అదే సమయంలో7 గంటలకుపైగా క్రస్ట్‌ గేట్లపై నుంచి నీరు ప్రవహించింది. దీనికి నిర్వహణ లోపమే అని పలువురు విమర్శిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 17 నుంచి 14శాతానికి తగ్గుతున్న కరోనా కేసుల రేటు

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల శాతం కొద్ది రోజులుగా కొంత తగ్గుముఖం పడుతోంది. గడిచిన రెండు వారాల్లో... ఒక దశలో 17.98 శాతంగా నమోదైన పాజిటివ్‌ కేసుల రేటు నాలుగైదు రోజులుగా 14-15 శాతం మధ్యే ఉంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాజకీయం.. నేరమయం- సుప్రీం తీర్పు ఆశాకిరణం

నేర చరితులను ఎన్నికల బరిలో దింపేందుకు తగిన కారణాలను వివరించాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పివ్వడం స్వాగతించదగ్గ పరిణామం. అయితే, ఈ తీర్పు ద్వారా ప్రశ్నలు అడిగే సాధికారత సంపాదించుకున్న ఎన్నికల కమిషన్లు రాజకీయ పార్టీలపై తగినంత ఒత్తిడిని పెంచుగలుగుతాయా? ఎన్నికల్లో నేరగాళ్లకు అడ్డుకట్ట వేసే దిశగా ముందడుగు వేసేలా ఎన్నికల సంఘానికి ఈ తీర్పు తోడ్పడుతుందా? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

  • ప్రపంచ అవసరాలకు తగ్గ నిపుణుల తయారీ- ప్రధాని

ఆత్మనిర్భర్​లో భాగంగా దేశంలో స్వయంసమృద్ధి సాధించాల్సి ఉందని... అందుకు తగ్గ మానవ వనరులను తయారు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ అవసరాలకు తగ్గట్టు శ్రామిక శక్తిని తయారు చేయడమే ప్రభుత్వ అజెండా అని ఉద్ఘాటించారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్​-చైనా వివాదం పరిష్కారానికి 'పంచ ప్రణాళిక'

కొన్ని నెలలుగా సరిహద్దుల్లో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు భారత్​-చైనా కీలక ముందడుగు వేశాయి. రష్యాలో సమావేశమై ఉభయ దేశాల విదేశాంగ మంత్రులు వివాద పరిష్కారానికి.. ఐదు అంశాల ప్రణాళికకు అంగీకారం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ ఒప్పందం జరిగితే.. రిలయన్స్​కు లాభం ఏంటి?

రిలయన్స్‌ రిటైల్‌లో భారీ వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌తో అమెజాన్‌ తన పెట్టుబడుల విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెజాన్​ కూడా ఈ ఒప్పందానికి అమితాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని వల్ల రిలయన్స్​కు వచ్చే లాభాలేంటి? వ్యాపార రంగంలో శత్రువులు... మిత్రులుగా మారనున్నారా? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి

  • రూ.4 కోట్లు మోసపోయిన బౌలర్ హర్భజన్ సింగ్!

చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్త, సీనియర్ స్పిన్నర్​ హర్భజన్ సింగ్​ను మోసం చేశాడు. రూ.4 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వడంలో కాలయాపన చేస్తున్నాడని భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఆచార్య'లో చరణ్‌ కోసం రష్మిక!

'ఆచార్య' కీలకపాత్రలో నటిస్తున్న రామ్​చరణ్​ కోసం హీరోయిన్​ను వెతుకుతోంది చిత్రబృందం. దీనికోసం హీరోయిన్​ రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.