ETV Bharat / city

ప్రధాన వార్తలు@9AM - trending news

.

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jul 13, 2020, 9:01 AM IST

  • సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కాజ సచివాలయం ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఇసుక' కార్పోరేషన్​

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇసుక కోసం కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బతుకులు 'ఛిద్రం'

నిర్మాణ కూలీలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కంప్యూటరు, మొబైల్‌ సర్వీసు సెంటర్ల నిర్వాహకులు, చిరుతిళ్ల వ్యాపారుల జీవితాలపై లాక్‌డౌన్‌ చావుదెబ్బ కొట్టింది. వ్యాపారాలు సాగకపోవటంతో వీరి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా మారుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అనంత' వివాదంపై తీర్పు

కేరళ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ మేనెజ్​మెంట్ వివాదంపై సోమవారం కీలక తీర్పును వెలువరించనుంది సుప్రీంకోర్టు. ఆలయ నేలమాళిగల్లో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నాయన్న వార్తలతో సంచలనంగా మారిన ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రకటన చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ ప్రకటనలు

జియోలోకి వరుస పెట్టుబడులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రుణరహితంగా మారేందుకు కావాల్సిన నిధులను రాబట్టింది సంస్థ. అదే ఉత్సాహంతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) ఈ నెల 15న జరగనుంది. ఈ సారి ఏజీఎంలో రిలయన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందనే అంశంపై అంచనాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బైడెన్​.. గెలిచెన్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు గెలవాల్సిన ప్రైమరీల్లో ఇప్పటికే జయకేతనం ఎగరేశారు డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్. తాజాగా ప్యూర్టోరికో నుంచి ఆయన ప్రైమరీల్లో విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'గొడవ వద్దన్నాడు'

గత అనుభవాలు గుర్తుచేసుకున్న లంక మాజీ సారథి సంగక్కర.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. గంగూలీ.. తమను గొడవ పెద్దది చేయొద్దని కోరినట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గత స్మృతులు

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్​. ధోనీతో కలిసి తాను ఓ రూమ్​ షేర్​ చేసుకున్నానని తాజాగా వెల్లడించాడు. గది చిన్నదిగా ఉండటం వల్ల తామిద్దరం నేలపైనే పడుకున్నామని తెలిపాడు గంభీర్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రత్యేక గీతం పక్కా..!

మెగాస్టార్​ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రం గురించి కొత్త అప్​డేట్​ చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాలో ఓ ఐటెం సాంగ్​, రొమాంటిక్​ సాంగ్​తో పాటు ఇద్దరూ హీరోలపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిబంధనలపై ఆగ్రహం

సినిమా షూటింగ్స్ విషయంలో కేంద్రం విధించిన నిబంధనలపై కొందరు బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. '65 ఏళ్లు' అనేది రాజకీయ నాయకులకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.