ETV Bharat / city

ప్రధాన వార్తలు@9AM - తెలుగు తాజా వార్తలు

.

9am top news
9AM ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 9, 2020, 9:01 AM IST

Updated : Jun 9, 2020, 10:38 AM IST

  • ఉపసంహరణ

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ తరఫున పిటిషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసే అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) బాధ్యతలు నిర్వర్తిస్తున్న న్యాయవాది జి.నాగేశ్వరరెడ్డి సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రహదారిపై చిరుత

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. దుర్గమ్మ గుడి వద్ద తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే ఉన్న రహదారిపై అడ్డంగా కూర్చొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలుగు రాష్ట్రాల్లో బంద్

జీవో 3 రద్దుకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నేడు బంద్‌కు పిలుపునిచ్చింది జీవో 3 సాధన కమిటీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేసి ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా జీవో 3 చట్టం తేవాలని డిమాండ్‌ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉత్తరాంధ్రలో నేడు భారీ వర్షాలు

వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నీటిలో కోతుల మృతదేహాలు

అసోంలోని కాఛార్​ జిల్లాలో కోతుల మృతదేహాలు కలకలం రేపాయి. దాదాపు 13 వానరాలు.. ఓ నీటి సరఫరా ప్లాంట్​లో తేలుతూ కనిపించాయి. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఎవరో కావాలనే జలాశయాన్ని విషపూరితం చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తీరు మారని చైనా

సరిహద్దు వెంట ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తోంది చైనా. లెఫ్టినెంట్ గవర్నర్ స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు పూర్తయిన రెండు రోజులకే సరిహద్దులో భారీ విన్యాసాలకు దిగినట్లు వెల్లడించింది. భారత్​కు గట్టి సందేశం ఇవ్వడమే ఈ చర్య లక్ష్యమని చైనా మీడియా పరోక్షంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరింత తీవ్రతరం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ అధానోం. అమెరికా, దక్షిణాసియాల్లోని 10 దేశాల్లోనే 75 శాతం కేసులు నమోదయినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గూగుల్ క్లౌడ్​కు సీనియర్ డైరెక్టర్​గా తెలుగు తేజం

గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్​గా తెలుగువారైన అనిల్ వల్లూరి నియమితులయ్యారు. అనిల్​కు ఐటీ పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవముంది. ఇటీవల వరకు నెట్ యాప్ సంస్థలో ఇండియా- సార్క్ దేశాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పోర్న్ స్టార్​గా మహిళా కార్ రేసర్

తను ఎంతో ఇష్టపడ్డ కార్ రేసింగ్​ను వదిలిపెట్టి.. పోర్న్​స్టార్​గా మారింది. అసలు ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చింది? ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అందుకే బాలయ్య కనిపించరట

తన జీవితంలో ఇప్పటివరకు వాణిజ్య ప్రకటనల్లో కనిపించకపోవడానికి బలమైన కారణముందని అంటున్నారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ప్రేక్షకులు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులను సంపద కోసం ఉపయోగించకూడదని నిశ్చయించుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jun 9, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.