తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరంగం వెంకటమ్మ (93).. కొద్ది రోజుల క్రితం మహమ్మారి బారిన పడ్డారు. కరోనా సోకిందని తెలిసినా.. కంగారు పడకుండా 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడారు. అనంతరం.. నెగిటివ్ రిపోర్ట్‌తో గది నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. ఎంతోమంది బాధితులకు ఆదర్శంగా నిలిచారు.
'కరోనా సోకిందని తెలిసిన మొదటిరోజే కాస్త భయమేసింది. రెండో రోజు నుంచి నేను దాని గురించి ఆలోచించడమే మానేశాను. నాకు బి.పి, షుగర్, మోకాళ్ల నొప్పులూ ఉన్నాయి. క్రమం తప్పకుండా మందులు వాడి.. మహమ్మారి నుంచి బయటపడ్డాను. భయంతోనే అనేక మంది చనిపోతున్నారని విన్నాను. కొవిడ్ బాధితులెవరూ అధైర్య పడవద్దు' - శ్రీరంగం వెంకటమ్మ
ఇదీ చదవండి: