ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

...

author img

By

Published : Sep 20, 2020, 8:59 AM IST

9 AM Top News
ప్రధాన వార్తలు
  • నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి పరీక్షలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇవాల్టి నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల26 వరకు మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అన్యమతస్థులకు శ్రీవారి దర్శనం.. డిక్లరేషన్​పై దుమారం!

అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన ఆవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనాదిగా వస్తున్న నిబంధనలను పక్కన పెట్టాలని నిర్ణయించడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 3 రాజధానులు నమ్మకద్రోహమే: పవన్ కల్యాణ్

అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదని.. ఇది ఆంధ్రులందరి సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని.. మూడు రాజధానులంటే నమ్మకద్రోహమేనని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు

కరోనా వ్యాప్తి కారణంగా ఇంత కాలం పాఠశాలలు, కాలేజీలను తెరవలేదు. రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరచుకోనున్నాయి. సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. 1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వివాదాల నడుమ నేడు రాజ్యసభకు వ్యవసాయ బిల్లులు!

విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ఆదివారం కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిల్లులను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆమోదంపై భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శివసేన.. ముంబయి ఎవరి జాగీరు?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బెదరగొట్టడానికి శివసేన మొరటు చేష్టలకు పాల్పడుతోంది. కంగన ఊళ్లో లేని సమయం చూసి ఆమె ఇంటిని కూలగొట్టింది. ప్రజాస్వామ్యం, న్యాయపాలనలను శివసేన ఇంతగా అపహాస్యం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి శివసేన సొత్తు కాదని, ఆ నగరంలో ప్రవేశించడానికి సేన నుంచి ఎవరూ వీసాలు పొందనక్కర్లేదని ఘాటుగా తేల్చిచెప్పాలి. ముంబయి భారతదేశమంతటికీ చెందుతుందని స్పష్టం చేయాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేపాల్​కు భారత్​ రైళ్లు గిఫ్ట్​

నేపాల్​లో మొదటిసారి బ్రాడ్​గేజ్​​ రైలు సేవలు ప్రారంభమైన సందర్భంగా ఆ దేశానికి రెండు రైళ్లు అప్పగించింది భారత రైల్వే. బిహార్​లోని జయ్​నగర్​-నేపాల్​లోని కుర్తాల మధ్య(35 కిలోమీటర్లు) నడిచే ఈ రైళ్ల ద్వారా ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరనుందని భారత రాయబార కార్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీ ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు

కరోనా నేపథ్యంలో బ్యాంకులు తమ సేవల్లో భారీ మార్పులు చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంటివద్దే బ్యాంకింగ్ సేవలు పొందడి అంటూ సరికొత్త సౌలభ్యాన్ని ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. మరి ఈ సేవలు ఎలా వినియోగించుకోవాలి? వీటికి ఏమైనా ఛార్జీలు ఉంటాయా? బ్యాంకింగ్​కు సంబంధించి ఏ ఏ అవసరాలకు ఇంటి దగ్గరి నుంచే సేవలు పొందొచ్చు? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తొలి మ్యాచ్​ చెన్నైదే

ఉత్కంఠగా సాగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​కింగ్స్ విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో అంబటి రాయుడు(71), డుప్లెసిస్ (58) కీలక పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ అనుబంధాల కొనసాగింపే 'యమలీల..ఆ తరువాత'

వెండితెరపై ఓ కథకు శుభం కార్డు పడింది. పాతికేళ్ల తర్వాత ఆ కథ పునఃప్రారంభమైంది.. అదే 'యమలీల.. ఆ తరువాత'. ఈ నెల 21(సోమవారం) నుంచి 'ఈటీవీ'లో రాత్రి 8గంటలకు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.