- తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. నేడు ధ్వజారోహణం
తిరుమలేశుడి బ్రహ్మోత్సవ సంబరాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు అంకురార్పణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దుర్గగుడి వెండి సింహాల మాయంపై కీలక ఆధారాలు
దుర్గగుడిలో వెండి రథంపై ఉండే మూడు సింహాలను లాక్ డౌన్ సమయంలోనే చోరీ చేసినట్టు ఆధారాలు లభిస్తున్నాయి. ఆలయంలో పని చేసే సిబ్బందితో పాటు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ: సీఎం జగన్
కరోనా నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపికి అనుమతినివ్వాలన్న ఆయన...దాతలను ప్రోత్సహించేందుకు 5 వేలు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జేసీకి అప్పగిస్తున్నామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 8,096 కరోనా కేసులు, 67 మరణాలు
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 74వేల 710 మందికి పరీక్షలు చేయగా... 8వేల 96 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6లక్షల 9వేల 558కి చేరింది. కొవిడ్ బీభత్సానికి మరో 67 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాతో ఉద్రిక్తతలపై కేంద్రం సమగ్ర సమీక్ష
వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో 'చైనా అధ్యయన బృందం' సమీక్షను నిర్వహించారు. చైనా బెదిరింపులకు పాల్పడుతున్న వేళ తూర్పు లద్దాఖ్ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. సరిహద్దుల్లో భారత సైన్యం కార్యాచరణ సన్నద్ధతపై సమాలోచనలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం మూడు కీలక బిల్లులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రెండు కొత్త బిల్లులు కాగా.. మరొకటి సవరణ బిల్లు. అధికార పక్షం ప్రవేశపెట్టిన ఈ బిల్లులకు.. లోక్‌సభలోనూ ఆమోదం లభించింది. అయితే ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మిత్ర పక్షాలు ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెయిల్ ఓటింగ్ ట్వీట్‌పై ట్రంప్‌కు ట్విటర్ హెచ్చరిక
మెయిల్ ఓటింగ్ విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌పై ట్విటర్ హెచ్చరికలు చేసింది. ట్రంప్ చేసిన ట్వీట్ పక్కతోవ పట్టించేదిగా ఉందని వివరణ ఇచ్చింది. ఈ సమాచారం సందేహాస్పదమైనదని తెలుపుతూ మెయిల్ ఓటింగ్‌పై వివరణ ఇచ్చే లింకును పెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అక్టోబరు 29 వరకు కఠిన నిఘా చర్యలు'
నిఘా చర్యలను అక్టోబర్ 29వరకు కొనసాగిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊగిసలాటలను నియంత్రించడానికే ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐపీఎల్ మజా షురూ.. తొలి మ్యాచ్‌లో ముంబయి-చెన్నై
క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు ఐపీఎల్ వచ్చేసింది. ఈరోజు తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ రసవత్తర పోరుకు అంతా సిద్ధమైపోయింది. కరోనా కారణంగా ఈసారి లీగ్ యూఏఈలో జరగబోతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అలరిస్తోన్న విష్ణు 'మోసగాళ్ళు' టైటిల్ మోషన్ పోస్టర్
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం 'మోసగాళ్ళు'. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.