రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93,511 పరీక్షలు నిర్వహించగా.. 8,766 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రంలో 17,79,773 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి కొత్తగా.. మరో 67 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,696కి చేరింది. 24 గంటల వ్యవధిలో 12,292 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,64,082కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,39,764 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,980, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 265 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి
YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!