తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,32,671 చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 185 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో మరో నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు 1,315 మంది తుదిశ్వాస విడిచారు.
కరోనా నుంచి మరో 1,554 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,13,466కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,890 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్లో 14,851 మంది బాధితులు ఉన్నారు.
ఇవీచూడండి: