ETV Bharat / city

ప్రధానవార్తలు@7PM - Ap Latest News

.

ప్రధానవార్తలు@7PM
ప్రధానవార్తలు@7PM
author img

By

Published : May 4, 2022, 7:06 PM IST

  • టెన్త్ పరీక్షల్లో సర్కారు ఫెయిల్.. ఇంటర్​లోనైనా పాస్​కండి : లోకేష్

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. లీకేజ్​ ఘటనలకు బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కనీసం ఇంట‌ర్ ప‌రీక్షలనైనా పక‌డ్బందీగా నిర్వహించాలని హితవు పలికారు. పరీక్షలు కూడా సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వమెందుకు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Social Welfare Residence School Entrance Exam Results: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబధించిన పరీక్షా ఫలితాలను ఆ శాఖ మంత్రి మేరుగ నాగార్జున సచివాలయంలో విడుదల చేశారు. 5 , 11 తరగతుల్లో ప్రవేశానికి సంబంధించి పరీక్షా ఫలితాలను ఆయన విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • యూఎన్ అవార్డులకు ఎంపికైన ఆర్బీకేలు: మంత్రి కాకాణి

రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితి ఫుడ్ ఆర్గనైజేషన్ అవార్డులకు ఎంపికయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆర్బీకేలు అవార్డులకు ఎంపిక కావటం గౌరవంగా ఉందన్న ఆయన.. సీఎం జగన్ ఆలోచనల ప్రతిరూపకంగానే ఆర్బీకేలు ఏర్పాటయ్యాయన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • ఎమ్మెల్సీ వేధిస్తున్నారంటూ.. తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం!

Mother and Son suicide attempt: ఇంటి పట్టా విషయంలో వైకాపా ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌, కమిషనర్ వేధిస్తున్నారంటూ తల్లీకొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హిందూపురం డిబి కాలనీలో 1992లో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో తాత్కాలిక షెడ్డు నిర్మించుకుంటే.. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు వేధిస్తున్నారని బాధిత కుటుంబం వాపోయింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • చిదంబరానికి నిరసన సెగ.. సొంత పార్టీ న్యాయవాదుల నుంచే..

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు పి.చిదంబరానికి నిరసన సెగ తగిలింది. ఓ కేసు వాదించడానికి కోల్​కతా హైకోర్టుకు ఆయన బుధవారం వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన సొంత పార్టీ న్యాయవాదులు నిరసన తెలిపారు. చిదంబరానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల వస్త్రాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ బంగాల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమికి కారణం చిదంబరమేనని ఆరోపించారు. టీఎంసీ పార్టీ సానుభూతిపరుడు అంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • వృద్ధుడి గొప్ప సంకల్పం.. మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..!

Amravati waterman: మండుటెండలో అడవి మార్గంలో ప్రయాణించే చిరు వ్యాపారుల కోసం 26 ఏళ్లుగా జలయజ్ఞం చేస్తున్నాడు ఓ సామాన్యుడు. వేసవిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే ఉండి.. అటువైపు వచ్చేవారికి చల్లటి మంచి నీరు అందిస్తున్నాడు. మూగ జీవాల కోసం నీటి తొట్టెలు నిర్మించి.. వాటి దాహార్తిని తీర్చుతున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • బైడెన్​ సర్కార్​ కీలక నిర్ణయం.. భారతీయులకు ప్రయోజనం!

US immigrant work visa: భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ఊరట కల్పించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ పర్మిట్‌ వీసా గడువు ముగుస్తున్న కొన్ని కేటగిరీల వారికి మరో 18 నెలల పాటు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు.. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఉన్నారు. ఈ నిర్ణయం మే 4 నుంచి అమల్లోకి రానున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • టోల్​ ఛార్జీలకు కొత్త రూల్స్.. ప్రయాణించిన కి.మీలకు మాత్రమే వసూలు!

Toll Gate Gps Navigation System: ఫాస్టాగ్​తో టోల్​ ఛార్జ్​ వసూలు విధానంలో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తెచ్చింది కేంద్రం. ఇప్పుడు మరో కీలక సంస్కరణకు సిద్ధమవుతోంది. టోల్​గేట్​ వద్ద ప్రతి వాహనానికి ఫిక్స్​డ్​ ఛార్జీ వసూలు చేసే విధానాన్ని మార్చాలని భావిస్తోంది. టోల్​ రోడ్​పై ఏ వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో జీపీఎస్​ ద్వారా తెలుసుకుని.. అంత దూరానికి మాత్రమే డబ్బులు వసూలు చేయాలని చూస్తోంది. ఇంతకీ.. ఈ విధానం ఎలా అమలవుతుంది? వాహనదారులకు లాభమా, నష్టమా? పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • పెళ్లిలో డ్యాన్స్​ చేస్తే.. ఈ స్టార్స్​కు ఎంత ఇస్తారో తెలుసా?

బడా వ్యాపారవేత్తలు, శ్రీమంతులు తమ ఇళ్లల్లో జరిగే.. పెళ్లిళ్లకు స్టార్స్​తో డ్యాన్స్​ ప్లాన్​ చేస్తుంటారు. ఇందుకోసం వారికి గట్టిగానే ముట్టజెప్పుతారు. ఈ ట్రెండ్ సౌత్​ కంటే..​ బాలీవుడ్​లో ఎక్కువగా ఉంటుంది. సినిమా కంటే.. ఇలాంటి ఈవెంట్లకే ఎక్కువ ఆదాయం రావడం వల్ల.. స్టార్స్ కూడా.. ఒకే చెబుతుంటారు. సల్మాన్​, షారూక్​, కత్రినా, దీపికా పడుకొణె ఇలా చాలామంది హీరో, హీరోయిన్లు.. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్​ చేసిన వాళ్లే. వివాహ వేడుకల్లో డ్యాన్స్​ చేసి.. ఎవరు ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

  • క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్

Sunil Gavaskar Mumbai plot: క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్​ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్​ను రిటర్న్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.