- Achennaidu :' రాజధాని హైదరాబాదే అయితే... వెళ్లిపోమనండి..'
మంత్రి బొత్సపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. వెళ్లిపోమనండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP Capital: అప్పటి వరకు ఏపీ రాజధాని హైదరాబాదే: మంత్రి బొత్స
రాష్ట్ర రాజధానిపై మంత్రి బొత్స సత్యనారయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్ అని అన్నారు. వైకాపా ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి శాసన రాజధాని మాత్రమేనని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- cabinet Meeting : రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్ధూ..!
సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటి అయ్యింది. 35 అజెండా అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మహిళల అక్రమ రవాణాలో ఏపీది రెండవ స్థానం'
వైకాపా ప్రభుత్వంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండవ స్థానంలో ఉందని ... మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు సీఎంకు లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Exit Polls: మినీ సార్వత్రికం ముగిసింది.. అధికారం ఎవరిది?
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఏడో విడత పోలింగ్‌తో.. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అందుకు ఒప్పుకోలేదని కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి!
కన్న తండ్రే ఆ కూతురు పాలిట కాలయముడిగా మారాడు. తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోనందుకు ఏకంగా ఆ యువతి గొంతు కోసి ప్రాణం తీశాడు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీ ఎన్నికలు సమాప్తం.. చివరి విడతలో 54% ఓటింగ్!
యూపీ చివరి దశ ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో విడతలో 54 స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18 శాతం ఓటింగ్ నమోదైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యుద్ధంపై విచారణకు రష్యా డుమ్మా.. మాస్కోను వెనకేసుకొచ్చిన చైనా
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన విచారణకు రష్యా డుమ్మా కొట్టింది. ఆ దేశం తరఫున న్యాయవాదులెవరూ కోర్టుకు రాలేదు. మరోవైపు, రష్యాకు వ్యతిరేకంగా రాజకీయ కూటమి ఏర్పాటు చేసేందుకు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లక్ష మంది అభిమానుల మధ్య ఎంసీజీలో వార్న్ అంత్యక్రియలు
స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో అధికారిక లాంఛనాలతో జరపనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు లక్షకుపైగా అభిమానులు హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే రెండేళ్లు కష్టపడ్డాం'
రాధేశ్యామ్ చిత్రం విడుదల నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. చిత్రంలోని క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే దాదాపు రెండేళ్లు కష్టపడ్డామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.