- అడ్డుకోవటం హేయం
దేవినేని ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవటం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని.. ఇది సిగ్గు చేటని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫలితాలు విడుదల
రేపు పదో తరగతి ఫలితాలు (Tenth results) విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం ఐదు గంటలకు విద్యాశాఖ మంత్రి సురేశ్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగా 2,145 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హత్యకు కారణాలివే..!
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పెద్దపుత్తేడు గ్రామంలో గత నెల 22న జరిగిన మధురెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పొలం విషయంలో తలెత్తిన వివాదం, తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతోనే గోపి అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌పై మరో కుట్ర
జమ్ముకశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 140 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. అయితే.. వారు చొరబడకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసకుంటోందని చెప్పారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక వసతులు నిర్మాణాలు ఇంకా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త ఉగ్ర సంస్థలు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని పలు నివేదికుల చెబుతున్నాయి. అయితే.. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా, జైషే వంటి వాటి స్థానంలో కొత్త మిలిటెంట్ గ్రూప్‌లు వెలుగులోకి వచ్చాయి. అవి స్థానికంగా ఏర్పడినవేనని, పాక్ హస్తం లేదని చూపేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టీకా గణేశుడు'!
కొవిడ్-19 నిబంధనలు పాటించటం, వ్యాక్సిన్ తీసుకోవటంపై గుజరాత్ వడోదరాకు చెందిన కళాకారుడు తనదైన శైలిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. టీకాపై కూర్చున్న పర్యావరణహిత గణేశుడి విగ్రహాన్ని.. పక్కనే సిరంజ్, చేతిలో మాస్క్‌తో రూపొందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.7.5 కోట్ల జాక్‌పాట్
విమానం రద్దు కావడం ఆ మహిళను కోటీశ్వరురాలిని చేసింది. ఆ సంగతి తెలిస్తే అదృష్టం అంటే ఇలా ఉండాలి అని అనుకుంటారు. ఇంతకీ విమానం రద్దుకు, ఆమె కోటీశ్వరురాలు అవడానికి సంబంధం ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ. 4 కోట్ల నజరానా
ఒలింపిక్స్ రజత పతక విజేత రవికుమార్ దహియాకు ప్రోత్సాహకం ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. అతడికి భారీ నజరానాతో పాటు ఉద్యోగం, భూమి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మెగాహీరో సందడి
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది దీపావళి పండుగకు థియేటర్లలో సందడి చేస్తుందని ప్రకటించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.