- రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్
కౌలు రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భూమి దున్నే రైతుల కోసం జై కిసాన్ అనే కార్యక్రమం చేపడతామన్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతులు నాలుగుసార్లు నష్టపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు
పింఛన్ల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 44.32 లక్షల పింఛన్లు ఇచ్చినట్లు చెప్పారని.. తెదేపా హయాంలో 50.29 లక్షల మందికి పింఛన్లు అందజేశామని తెలిపారు. జగన్ అవగాహనలేని.. జీరో ముఖ్యమంత్రి అని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సముద్రంలో మత్స్యకారుల మధ్య వివాదం.. బోట్లతో ఛేజింగ్..!
సముద్రంలో సుమారు 15 బోట్లు.. ఒకదాని మీదకి ఒకటి రయ్యిమంటూ దూసుకుపోతున్నాయ్. సముద్రం అల్లకల్లోలమైంది. బోట్లపైనే ఇరువర్గాలు గొడవపడుతూ.. సముద్రాన్ని రణరంగంలా మార్చారు. ఇదేదో సినిమా ఛేజింగ్ ఫైట్ అనుకునేరు..! రెండు వర్గాల మత్స్యకారుల మధ్య సముద్రంలో జరిగిన గొడవ సినిమా ఛేజింగ్‌ను తలపించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని తీరప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘనపై సుప్రీం ఆందోళన
కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘనపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు కఠినంగా అమలుచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఈ నెలలోనే కరోనా టీకాకు అనుమతులు!'
దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఈ నెల చివరి నాటికి అనుమతులు లభిస్తాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. టీకా సరఫరాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రజనీ రాజకీయానికి సవాళ్ల స్వాగతం
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారైంది. ఇప్పుడు చర్చంతా ఆయన ప్రణాళికలపైనే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజకీయంగా ఆయన ఎంత సన్నద్ధంగా ఉన్నారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆయన వయసు కూడా సమస్యగా మారే అవకాశముందని భావిస్తున్నారు. మరి రజనీ పార్టీ ముందున్న సవాళ్లేంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ట్రంప్ 2.0: 'మిషన్ 2024'కు సన్నద్ధం!
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం 'మిషన్-2024' కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు ట్రంప్. ఓవైపు ప్రస్తుత ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు తదుపరి ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నారు. 'ఇప్పుడు కుదరకపోతే నాలుగేళ్ల తర్వాత అయినా తిరిగొస్తా' అని రిపబ్లికన్లకు ధీమాగా చెబుతున్నారు. ఇంతకీ ట్రంప్ ప్రణాళిక ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరింత ప్రియమైన బంగారం, వెండి
దేశీయంగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో గురువారం రూ.480కిపైగా ఎగిసింది. వెండి ధర కిలోకు మళ్లీ రూ.63,500 వేల పైకి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీ20ల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే?
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది టీమ్ఇండియా. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. దీంతో టీ20ల్లో అయినా గెలవాలన్న పట్టుదలతో బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహాబలేశ్వరంలో 'ఆర్ఆర్ఆర్'.. గోవాకు 'క్రాక్'
ప్రముఖ కథానాయకులు రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ తమ చిత్ర షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. మహాబలేశ్వరంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ జరుగుతుండగా.. 'క్రాక్' షూటింగ్ కోసం రవితేజ, గోవాకు పయనమయ్యాడు. అలాగే జైసల్మేర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంపులోని జవాన్లతో ఒక రోజంతా గడిపినట్లు రానా దగ్గుబాటి ట్విట్టర్లో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.