ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@7AM

.

7am topnews
ఏపీ ప్రధానవార్తలు@7AM
author img

By

Published : Sep 7, 2022, 6:56 AM IST

  • పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

పోలవరం ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సరిహద్దు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్​

సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్...ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తూ వస్తున్నామన్న సీఎం... నెల్లూరు జిల్లాలో కరవు మండలమంటూ ఉండకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకున్న ఆంధ్రప్రదేశ్

రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 500 కోట్ల రూపాయల మేర సెక్యూరిటీలను వేలం వేసి, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాన్ని తీసుకుంది. 7.58 శాతం వడ్డీకి ఈ వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మాజీ మంత్రి నారాయణకు సీఐడీ కేసులో ముందస్తు బెయిల్

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ విషయంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ తదితరులకు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అభియోగ పత్రం దాఖలు చేసే వరకు దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిల్లీలో వందల కిలోల డ్రగ్స్​ స్వాధీనం.. విలువ రూ. 1200 కోట్లపైనే!

దేశంలో మరొ భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను దిల్లీ పోలీసులు సీజ్‌ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్‌) ఉండటం గమనార్హం. దీంతోపాటు 10కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సినిమా రేంజ్​లో ప్రయాణికుడ్ని కాపాడిన రైల్వే పోలీస్​.. వీడియో వైరల్​

రైల్లోంచి పడిపోతున్న ఓ ప్రయాణికుడ్ని రైల్వే పోలీసు చాకచక్యంగా కాపాడాడు. తన సామాన్లు తీసుకోవడానికి ప్రయాణికుడు ప్లాట్​ఫాంపై దిగాడు. అంతలోనే ట్రైన్​ కదిలింది. పరిగెడుతూ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు ప్రయాణికుడు. ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పి కిందపడబోయాడు. ఇది గమనించిన పోలీసు.. వెంటనే అతడిని రైల్లోకి నెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంటర్​ బాలిక ప్రసవం.. శిశువు మృతి.. పదో తరగతి విద్యార్థే..!

ఓ పాఠశాల శౌచాలయం వద్ద మృత శిశువు దొరికింది. దాన్ని చూసిన కొందరు విద్యార్థులు ఉపాద్యాయులకు తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిటన్​ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్.. నియమించిన క్వీన్​ ఎలిజబెత్​ 2

బ్రిటన్​ కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్షురాలిగా లిజ్​ ట్రస్​ విజయం సాధించారు. ప్రత్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్​పై గెలుపొంది బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా బ్రిటన్​ రాణి ఎలిజబెత్​ 2.. లిజ్​ను అధిరికంగా ప్రధానమంత్రిగా నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉత్కంఠ పోరులో ఓడిన భారత్‌.. ఫైనల్‌ ఆశలు గల్లంతు!

చావోరేవో మ్యాచ్‌లో భారత్‌ చేతులెత్తేసింది. ఆసియాకప్ ఫైనల్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమి చవిచూసింది. సూపర్‌-4లో భాగంగా భారత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఓటమితో భారత్‌ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా సంతోషమే: నటుడు ఆర్య

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కొద్దిమంది తమిళ నటుల్లో ఆర్య ఒకరు. 'వరుడు'లో ప్రతినాయకుడి పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు 'వాడు వీడు', 'నేనే అంబానీ', 'రాజారాణి' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.