- జనసేనకు పలు పార్టీల మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన పవన్
PAWAN KALYAN THANKS TO ALL : జనసేనకు మద్దతు తెలిపిన పలు పార్టీ నేతలకు జనసేనాని పవన్ కృతజ్ఞతలు తెలిపారు. వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అందరూ చూశారని.. ప్రభుత్వ వైఖరిని ఖండించిన నేతలకు ధన్యవాదాలు చెప్పారు.
- భాజపాపై కమ్యూనిస్టుల ప్రకటనలు హాస్యాస్పదం : సోము వీర్రాజు
SOMU VEERRAJU ON COMMUNIST PARTY : కమ్యూనిస్టులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీలకు దేశ భక్తి లేదని.. అందుకే వాళ్లను ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నారు. భాజపాను అధికారం నుంచి దూరం చేస్తామని కమ్యూనిస్టులు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.
- విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన.. 28 మంది జన సైనికులపై కేసులు
Police Case on Janasena Activists: శనివారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటనపై పోలీసు కేసులు నమోదయ్యాయి. మంత్రి రోజా సహాయకుడు దిలీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఒక కేసు,.. ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పెందుర్తి ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు.
- ఏపీ ఎన్నికల బరిలో జేపీ..లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం
JP will contest as a Member of Parliament: వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా జయప్రకాశ్ నారాయణ పోటీ చేయాలని లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలంటే జేపీ పోటీ చేయాలని తీర్మానించింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్లాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
- రెండున్నర కేజీల పాము విషం.. ఫ్రాన్స్ నుంచి చైనాకు స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్లు
పాము విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అటవీ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండున్నర కేజీల విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు.
- దొంగ అనుకొని మూకదాడి.. అక్కడికక్కడే వ్యక్తి మృతి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
ఝార్ఖండ్‌లో ఓ వ్యక్తిని దొంగగా భావించి.. గ్రామస్థులంతా మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో అతడు మరణించాడు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో ఓ కానిస్టేబుల్ తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- 'తైవాన్ జోలికి వస్తే తగ్గేదేలే.. అవసరమైతే ఆ పనీ చేస్తాం'
CPC Meeting China : తైవాన్ను చైనా భూభాగంతో ఏకం చేయడానికి అవసరమైతే బలప్రయోగానికీ వెనుకాడబోమని అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ప్రారంభ ఉపన్యాసం చేసిన జిన్‌పింగ్.. తైవాన్ విషయంలో అమెరికా తీరుపై మండిపడ్డారు. ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తోందని, ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
- 'అది రూపాయి పతనం కాదు.. డాలర్ బలపడటం'.. నిర్మలా సీతారామన్
రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డాలర్ విలువ బలపడుతున్నందునే.. రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని ఆమె వివరించారు.
- 'క్రికెట్ ప్రపంచమా.. ఆ పేరు గుర్తుపెట్టుకో'.. సచిన్ ట్వీట్ వైరల్
టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకకు షాకిస్తూ చిన్న జట్టు నమీబియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ నమీబియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
- అక్షయ్ కుమార్‌కు రూ.260 కోట్ల ప్రైవేట్ జెట్.. స్పందించిన నటుడు
అక్షయ్‌కుమార్‌కు సుమారు రూ.260 కోట్లు విలువ చేసే ప్రైవేటు జెట్ ఉందంటూ బాలీవుడ్ వెబ్సైట్లో ఓ కథనం ప్రచురితమైంది. దానిపై అక్షయ్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM - ap top ten news
..
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM