- క్షణికావేశంలో చెన్నుపాటిపై దాడి.. మారణాయుధాలు వాడలేదు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని చేతులతో కొట్టడంవల్లే కంటికి గాయమైందట! ఇనుపచువ్వతో పొడిచినట్లు ఆధారాలే లేవట. ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో వాగ్వాదం చోటుచేసుకుని క్షణికావేశంలో చేతులతో కొట్టుకునే క్రమంలో ఆయన కంటికి గాయమైందట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పూర్తయిన సంగం, పెన్నా బ్యారేజీలు..
నెల్లూరు జిల్లాలో సంగం, పెన్నా బ్యారేజీలు రోజురోజుకు కొత్త అందాలతో సుందరంగా కనిపిస్తున్నాయి. సంగం బ్యారేజి 1195 మీటర్లు పొడవు, 85 గేట్లతో నిర్మించారు. పెన్నా బ్యారేజి 650 మీటర్లు పొడవు, 57 గేట్లతో నిర్మించారు. ఈ రెండు బ్యారేజీల పనులు దాదాపు పూర్తయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాగల 3 రోజులు భారీ వర్షాలు.. బీ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ కుటుంబం దోపిడీ పెరిగిపోయింది..రూ. 2 లక్షల కోట్లు దోచుకుందన్న తెదేపా
వైఎస్సార్ హయాంలో జరిగిన అవినీతికి ఆధునికతను జోడించి జగన్ కుటుంబం ఇప్పటివరకు రూ.2 లక్షల కోట్లకు పైగా దోచుకున్నట్లు చెబుతున్న తెలుగుదేశం.. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. పార్టీ శ్రేణుల ద్వారా ప్రజలకు వివరించేలా కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేస్తోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో జగన్, భారతీరెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉందని వివరిస్తూ.. ఓ పుస్తకాన్ని తెలుగుదేశం రూపొందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాంచీకి అధికార పక్షం ఎమ్మెల్యేలు.. ఉత్కంఠగా ఝార్ఖండ్ రాజకీయం
ఝార్ఖండ్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సోమవారం జరగనున్న విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ వెళ్లిన 30 మంది ఎమ్మెల్యేలు తిరిగి రాంచీకి చేరుకున్నారు. విశ్వాస పరీక్ష అనంతరం ఝార్ఖండ్ రాజకీయాల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చదువులో ముందున్నాడని కూల్ డ్రింక్‌లో విషం..
తన పిల్లల కంటే చదువులో ముందున్నాడని కూల్ డ్రింక్‌లో విషం కలిపిందో మహిళ. అది తాగిన బాలుడు వాంతులు చేసుకుని ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని కారైకాల్ మున్సిపాలిటీలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రిటన్ తదుపరి ప్రధానిగా.. లిజ్ ట్రస్ ఎన్నిక లాంఛనమేనా?
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. బోరిస్ జాన్సన్ వారసుడి పదవికి లిజ్ ట్రస్, భారత సంతతి నేత రిషి సునాక్ పోటీ పడ్డారు. శుక్రవారంతో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ ముగియగా.. సోమవారం ఫలితాలు ప్రకటించనున్నారు. సునాక్‌పై లిజ్ ట్రస్ విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ మిస్త్రీ కన్నుమూత
టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త సైరస్ మిస్త్రీ(54) కన్నుమూశారు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చేజేతులా ఓడిన భారత్.. ప్రతీకారం తీర్చుకున్న పాక్
2 ఓవర్లలో పాక్ 26 పరుగులు చేయాలి. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ చేతిలో బంతి. కానీ అతను కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. పేలవంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 19 పరుగులొచ్చాయి. సమీకరణం తేలికైపోయింది. ఇలా పాకిస్థాన్‌పై గెలవడానికి భారత్‌కు ఎన్ని మంచి అవకాశాలు వచ్చాయో! వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన రోహిత్ సేన.. ఈసారి ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. గ్రూప్ దశలో ఓటమికి.. కీలకమైన సూపర్-4 మ్యాచ్‌లో ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది పాక్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్
తన రెండో పెళ్లిపై మంచు మనోజ్ స్పందించారు. నగరంలోని ఓ వినాయక మండపాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో 'మీరూ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు?' అని ఒకరు అడగ్గా అది వ్యక్తిగత విషయమని, సందర్భం వస్తే తప్పకుండా చెబుతానని మనోజ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.