తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 7,994 కొవిడ్ కేసులు నమోదుకాగా... మరో 58 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,009 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 76,060 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మరో 1,630 కరోనా కేసులు నమోదు కాగా... మేడ్చల్ జిల్లాలో 615, రంగారెడ్డి జిల్లాలో 558, నల్గొండ జిల్లాలో 424 మందికి కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లాలో 337 మంది, నిజామాబాద్ జిల్లాలో 301 మంది, సిద్దిపేట జిల్లాలో 269 మంది కొవిడ్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి:
'కొవిడ్ వచ్చిన వారు జాగ్రత్తలు తీసుకోకపోతే గుండె పోటు'
కరోనాను జయించిన 23 రోజుల చిన్నారి