- నారాయణ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు : సజ్జల
మాజీ మంత్రి నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్టు చేయించేవారన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో అరెస్టైన నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
- కుప్పంలో చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
CBN TOUR: సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఆయన కుప్పులో పర్యటించనున్నారు.
- చంద్రబాబు ఫోన్ ఎప్పట్నుంచి ట్యాప్ చేస్తున్నారో చెప్పాలి : వర్ల రామయ్య
ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. జగన్ తన మూడేళ్ల పాలనలో ఎంతమంది నేతల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూశారో, ఎందరి ఫోన్లు ట్యాప్ చేశారో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- రుణం ఎగవేత కేసులో.. బ్యాంకు మేనేజర్‌పై ఈడీ ఛార్జ్‌షీట్
కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) రుణం ఎగవేత కేసులో బ్యాంకు మాజీ మేనేజర్‌తోపాటు రుణం పొందిన సంస్థ ఎండీపై ఈడీ ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఉద్దేశించిన పనికి వినియోగించకుండా ఓ సినిమాకు పెట్టుబడులుగా పెట్టారని ఈడీ పేర్కొంది.
- Road accident: పెళ్లింట విషాదం... శుభలేఖలు పంచేందుకు వెళ్లి..!
Road accident: సంతోషంగా పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన కాబోయే వరుడిని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. వారం రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు.. ఊహించని రీతిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. దీంతో.. పెళ్లి వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఇంట.. పెను విషాదం నెలకొంది.
- ఎయిర్‌పోర్ట్‌లో 62 కిలోల హెరాయిన్ సీజ్.. విలువ రూ.430 కోట్ల పైనే!
Drugs seized in delhi airport: దిల్లీ విమానాశ్రయంలో రూ.434 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 62 కిలోల ఈ హెరాయిన్‌ను ఉగాండా నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు తరలించేందుకు నిందితులు యత్నించారని అధికారులు తెలిపారు. మరోవైపు మణిపుర్లో కూడా హెరాయిన్ తరలింపును అడ్డుకున్నారు అక్కడి అధికారులు.
- "మహిళా ఉద్యోగులకు 'మూడోసారీ' ప్రసూతి సెలవులు.. కానీ..."
Third Maternity Leave: మహిళా ఉద్యోగులకు మూడో సంతానానికి కూడా ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని ఆదేశించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. విడాకులు తీసుకున్న అనంతరం.. మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చిన ఉద్యోగినులు ఈ సెలవులను పొందవచ్చు.
- రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని.. బాలికపై వరుడి అత్యాచారం
Bridegroom Raped a Minor Girl: మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వరుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నిందితుడు వాయుసేన అధికారి అని పోలీసులు గుర్తించారు. మరో ఉదంతంలో 17 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు 60 ఏళ్ల వృద్ధుడు. రాజస్థాన్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- రష్యాకు ఉక్రెయిన్ షాక్.. గ్యాస్ సరఫరాకు బ్రేక్!
Ukraine Russia War: ఉక్రెయిన్‌పై సైనికచర్యకు దిగిన రష్యాకు కీవ్ బలగాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్న వేళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ మీదుగా పశ్చిమ యూరప్‌కు సరఫరా అయ్యేరష్యా సహజవాయువును అడ్డుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి మాస్కో సహజవాయువు సరఫరాపై ప్రభావం పడింది. దీంతో మాస్కో మరో మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
- 'సర్కారు వారి పాట'లో 'సితార'ను బలవంతంగా ఇరికించారా? మహేశ్ క్లారిటీ!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12 థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ శ్యామల.. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు పరుశురామ్, సంగీత దర్శకుడు తమన్‌తో చిట్ చాట్ నిర్వహించారు.