- ఆగని విజృంభణ
రాష్ట్రంలో కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో 67 మంది మృతి చెందారు. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,764కు చేరాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే'
రాజధాని విషయంలో వైకాపా ప్రభుత్వ తీరును జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని సమర్ధించిన జగన్... ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు అనడం ఏంటని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భయంగా ఉంది'
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ అక్కడ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అమిత్ షాకు కరోనా పాజిటివ్
కొవిడ్ మహమ్మారికి సామాన్యులే కాకుండా పలువురు మంత్రులు, ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ప్రపంచానికి చాటిచెప్పండి'
మహాకావ్యం రామాయణంలోని ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ప్రపంచం మొత్తానికి ఆ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నిలకడగా సోనియా ఆరోగ్యం
సాధారణ వైద్య పరీక్షల కోసం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అవే మార్కెట్లకు కీలకం !
రెపో రేటుపై ఆర్బీఐ నిర్ణయం, జులై నెల ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాల లెక్కలు సహా అనేక అంశాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, టాటా స్టీల్ ఈ వారమే క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఐపీఎల్‌తో ఉపయోగం లేదు'
ఐపీఎల్, ధోనీ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడదని అన్నాడు మాజీ బౌలర్ నెహ్రా. భారత్ తరఫున మహీ చివరి మ్యాచ్ ఎప్పుడో ఆడేశాడని చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనాను జయించిన బిగ్‌బీ
దాదాపు మూడువారాల పాటు కరోనాతో పోరాడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఎట్టకేలకు కోలుకున్నారు. నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.