- నేరమేంటో చెప్పకుండా ఈ అరెస్టు ఏంటి...?
మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు దారుణమని... అతని పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు గర్హనీయమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారం ఉందన్న అహంకారంతో చేస్తున్న ఉన్మాద చర్యలే ఇలాంటి అరెస్టులని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఈఎస్'ఐ'.. ఏసీబీ ఏం చెబుతుందంటే..?
రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అనిశా అధికారులు తెలిపారు. అధికారం అండతో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. కాల్‌సెంటర్, ఈసీజీలకు సంబంధించి ఓ సంస్థతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల ధర్నా..
మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నాయకులు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని నేతలు మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన అచ్చెన్నాయుడిని... వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తిండి తినకుండా 16 ఏళ్లుగా 'టీ'తోనే!
మానవుని ప్రాథమిక అవసరాల్లో ఆహారం ఒకటి. ఒక్కపూట తినకపోతేనే.. రెండో పూట కాస్త తొందరగా తినేలా ప్రణాళికలేసుకుంటాం. లేదా చిరుతిళ్లు తినేందుకు ప్రయత్నిస్తుంటాం. అలాంటిది భోజనమే మానేసి.. 'టీ'తో 16 ఏళ్లుగా అద్భుతంగా జీవిస్తున్నాడో వ్యక్తి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణలు పునఃప్రారంభం
లాక్‌డౌన్‌తో స్తంభించిన చిత్ర పరిశ్రమలో రెండున్నర నెలల తర్వాత మళ్లీ పనులు మొదలయ్యాయి. ఈటీవీలో ప్రసారమయ్యే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ధారావాహిక షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో పునఃప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'జీఎస్టీపై వడ్డీ కోతతో చిరు వ్యాపారికి ఊతం'
చిన్నవ్యాపారులకు ఉపశమనం కల్పించే దిశగా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు చెల్లించాల్సిన పన్నుమొత్తంపై వడ్డీని 18 నుంచి 9 శాతానికి తగ్గించింది. 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి ఆలస్య రుసుముగా రూ. 500వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎడారిలా మారిన జలాశయం
కరవు వచ్చినపుడో, ఎగువ నుంచి నీరు రానప్పుడో... జలాశయాలు సహజంగానే ఎండుతాయి. కానీ, ఆ జలాశయం మాత్రం మరమ్మతుల పేరిట ఖాళీ అయిపోయింది. నిండు కుండలా కళకళలాడే ఆ జలాశయం.. ఇప్పుడు చుక్కనీరు లేకుండా ఎడారిలా మారింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- గూగుల్‌లో కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల సమాచారం
కొవిడ్-19 కు సంబంధించి గూగుల్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి గూగుల్‌లో వెతికితే.. టెస్టింగ్ ల్యాబ్‌ల సమాచారం కూడా కనిపించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ''టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా రోహిత్‌కు ఉంది'
టీ20ల్లో డబుల్ సెంచరీ చేయగల సత్తా రోహిత్ శర్మకు ఉందని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. శతకాన్ని చేసిన తర్వాత అతడి స్ట్రైక్‌రేట్ అమాంతం పెరుగుతుందని తెలిపాడు. భవిష్యత్‌లో అయినా ఈ ఘనతను రోహిత్ కచ్చితంగా సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు కైఫ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి