- కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం.. కొత్త పేరు ఏంటంటే !
కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
- ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది.. ఇక ఆపలేరు: చంద్రబాబు
జగన్ లాంటి నియంతలకు తాను భయపడబోనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైందని ప్రశ్నించారు. కడపలో జరిగిన జిల్లా స్థాయి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు పాల్గొన్నారు.
- కృష్ణా డెల్టాలో ఈ ఏడాది మూడు పంటలకు నీళ్లు : మంత్రి జోగి రమేశ్
ఈ క్రాప్ నమోదు, ధాన్యం విక్రయాలు వంటి అంశాల్లో గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి జోగి రమేశ్ అధికారులను ఆదేశించారు. కృష్ణా డెల్టాలో ఈ ఏడాది మూడు పంటలు పండించేకునేందుకు అనువుగా జూన్ 10 నాటికి సాగునీరు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
- 'ప్రైవేట్ వ్యక్తులు కీలక హోదాల్లో ఉంటే.. తప్పులు జరిగినప్పుడు ఎవర్ని బాధ్యులను చేస్తారు'
సచివాలయంలో ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీల పోస్టుల్లో ప్రైవేట్ వాళ్లని రిక్రూట్ చేసుకోవడాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. శాఖల్లో చాలా ఖాళీలున్నాయని, పదోన్నతులూ పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
- 'భార్య ఉద్యోగం చేస్తున్నా భరణం తప్పనిసరి'.. విడాకుల కేసులో హైకోర్టు తీర్పు
విడాకులు తీసుకున్న భార్య ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ భరణానికి అర్హురాలేనని కీలక తీర్పు వెలువరించింది బొంబాయి హైకోర్టు. భర్త నుంచి పొందాల్సిన భరణం హక్కును ఆమె ఆదాయంతో అడ్డుకోలేమని స్పష్టం చేసింది.
- సీఎంతో మీటింగ్‌కు వచ్చి ప్లేట్ల కోసం ఫైట్- చిక్కుల్లో ప్రధానోపాధ్యాయులు
విద్యా ప్రమాణాలు పెంచడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నిర్వహించిన ఓ సమావేశం.. రెండు జిల్లాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చిక్కులు తెచ్చిపెట్టింది. సీఎంతో భేటీ తర్వాత భోజనం ప్లేట్ల కోసం వారంతా గొడవ పడడమే ఇందుకు కారణం.
- స్వదేశీ యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం సక్సెస్
భారత నావికాదళం.. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి నౌకా విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.
- తగ్గిన బంగారం ధర.. వెండి పైపైకి.. స్టాక్ మార్కెట్లకు మళ్లీ నష్టాలు
బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. మరోవైపు వెండి ధర 1000కిపైగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- అభిమాని లేఖకు ధోనీ ఫిదా.. రిప్లై ఏమిచ్చాడంటే..
చెన్నై సారథి ధోనికి ఓ అభిమాని లేఖ రాశాడు. మహీ అంటే ఎంత ఇష్టమో అందులో వివరించాడు. దానికి ఫిదా అయిన సీఎస్కే కెప్టెన్.. చాలా అద్భుతంగా రాశావంటూ మెచ్చుకున్నాడు. ఆ లేఖపై సంతకం కూడా పెట్టాడు.
- ఖరీదైన కారు కొన్న విశ్వక్ సేన్.. అది నాదే అంటూ దర్శకుడి పోస్ట్
'అశోకవనంలో అర్జునకల్యాణం'తో సక్సెస్‌ని సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్.. ఓ ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దాన్ని చూసేద్దాం..