- 'గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం'
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లోని విద్యార్థులతో వెంకయ్య నాయుడు ముఖాముఖి నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీఆర్సీ ఒప్పుకునే ప్రసక్తే లేదు: బండి శ్రీనివాసరావు
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో భవిష్యత్త్ కార్యచరణను ఖరారు చేస్తామని..అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
ఉద్యోగులకు నష్టం కల్గించే పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రకాశం జిల్లాలో పెట్రోల్ సీసాతో వృద్ధ దంపతుల నిరసన
ప్రకాశం జిల్లా వెలిగండ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద పెట్రోల్ సీసాతో వృద్ధ దంపతుల నిరసన వ్యక్తం చేశారు. తమ పొలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నయా స్టైల్లో 'మద్యపాన నిషేధం'.. త్వరలో ప్రత్యేక కోర్టులు.. సీఎం కొత్త ప్లాన్!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మద్యపాన నిషేధ చట్టానికి సవరణలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కొన్ని సడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎనిమిదేళ్ల చిన్నారిపై రేప్.. అరెస్ట్ చేసే సమయంలో పోర్న్ చూస్తూ..
దిల్లీ శివార్లలో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. అనంతరం మరో రేప్ చేసేందుకు బాలిక కోసం గాలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో 'నో'- ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!
రెండో పెళ్లి కోసం సంబంధం చూసేందుకు ఓ మ్యారేజ్ బ్యూరో నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టాడు ఓ వృద్ధుడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. దక్షిణ కొరియాలోని జేజు ఐలాండ్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోబోలపై రిలయన్స్ గురి.. రూ.983 కోట్ల పెట్టుబడులు
ఇతర సంస్థల్లోకి రిలయన్స్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా నోయిడాకు చెందిన ఓ రోబోటిక్స్ సంస్థలో 54 శాతం వాటాను కొనుగోలు చేసింది రిలయన్స్. సుమారు రూ. 983 కోట్లకు పైగా వెచ్చించి ఈ షేర్‌ను సొంతం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాగి రచ్చ చేసిన క్రికెటర్లు.. చివరకు..
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ ఆనందంలో కొందరు క్రికెటర్లు శ్రుతిమించి మద్యం సేవించి హోటల్ గదిలో అల్లరి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీకి ఊరట
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు ఊరట లభించింది. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.