- కోర్టు నోటీసులు
బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 10న విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూల్చాల్సిన అవసరం మాకు లేదు
మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జీ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు.. భయంతో చేసినవేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ ప్రభుత్వం లేఖ
పోతిరెడ్డిపాడు నుంచి నీరు తరలించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వం ఆదుకోవాలి
నేతన్నలకు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీ సీఎంకు బెదిరింపులు
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్థానీ అనుకూల సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. త్రివర్ణ పతాకం ఎగురవేసేందుకు యోగిని అనుమతించేది లేదంటూ ఆడియో సందేశం వచ్చింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్రలతో కొట్టుకున్న జనం
బిహార్ అరారియా జిల్లాలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఫారబిస్‌గంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో వ్యాక్సిన్ కోసం టీకా కేంద్రానికి వెళ్లిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ పరస్పర దాడులకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్థులకు కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మహిళను చితకబాదిన అర్చకుడు..
దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఓ మహిళా భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. మూసి ఉన్న ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందన్న కారణంతో ఆమెను తీవ్రంగా కొట్టాడో అర్చకుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుప్పకూలిన రెండంతస్తుల భవనం
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దిల్లీ, బిహార్, యూపీల్లోనూ భారీగా వర్షాలు కురిశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌కు ఆరో పతకం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో గెలిచాడు టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా. ఈ కాంస్యంతో.. ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Raj Kundra: 'అలా చేయిస్తాడనుకోలేదు'
రాజ్‌కుంద్రాపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంద్రా.. తనతో తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదన్నారు. ఆయన చెప్పిన మాటలు నమ్మి చివరికి మోసపోయానని షెర్లిన్ కన్నీటిపర్యంతం అయ్యారు. కుంద్రా కేసులో షెర్లిన్‌ను తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.