ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

5pm_Topnews
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Jul 27, 2021, 5:00 PM IST

  • ఉత్తర్వుల్లో మార్పులు..

ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం మినీ ట్రక్కుల కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చే 90 శాతం మేర రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాలకు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ సహకార ఆర్ధిక కార్పొరేషన్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అధికారులు తరచూ తనిఖీ చేయాలి..

కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సరిగా తనిఖీలు చేయనివారికి మెమోలు జారీచేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్పందన రాలేదు: కేంద్ర హోంశాఖ..

దిశ బిల్లుపై ఏపీ నుంచి తిరిగి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. రాష్ట్రం పంపిన దిశ బిల్లులో అభ్యంతరాలపై వివరణ కోరామని.. అయితే దానిపై ఏపీ ఇప్పటివరకు స్పందించలేదని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సర్పంచ్ దారుణ హత్య..

కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్​ను దారుణ హత్యకు గురయ్యాడు. వైకాపా సానుభూతి పరుడైన సర్పంచ్ మునెప్పను ప్రత్యర్థులు చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆధిపత్య పోరు కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్త సీఎంపై కాసేపట్లో స్పష్టత!

యడియూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి కోసం 'రాజకీయ వేట' మొదలైంది. ఇప్పటికే అధిష్ఠానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుడే పిల్లలకు కరోనా టీకా

ఆగస్టులోనే పిల్లలకు టీకా అందిచనున్నట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్​సుఖ్​ మాండవియా తెలిపారు. భారత్​ త్వరలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా అవతరించబోతుందన్నారు. మరోవైపు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి పల్లెలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీలకు నిర్దేశించారు ప్రధాని నరేంద్ర మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ధోలవిరాకు యునెస్కో వారసత్వ గుర్తింపు

గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. హరప్పా నాగరికత నాటి పట్టణంగా ప్రసిద్ధిగాంచిన ధోలవిరాను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్లు యునెస్కో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బలగాల ఉపసంహరణ

సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలుకుతూ ఇరాక్‌ నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇరాక్‌ నుంచి బలగాలు వెనక్కి వచ్చే ప్రక్రియ పూర్తవుతుందని అగ్రరాజ్యాధినేత జో బైడెన్‌ తెలిపారు. సైన్యం కోసం అధికంగా ఖర్చవుతుండడం వల్ల ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రక్రియను అమెరికా చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కృనాల్‌ పాండ్యాకు కరోనా

టీమ్ఇండియా, శ్రీలంక మధ్య మంగళవారం జరగనున్న రెండో టీ20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్​ అభిమానులకు ఊహించని షాక్​! భారత ఆల్​రౌండర్​ కృనాల్​ పాండ్యాకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో అతడితో సన్నిహతంగా ఉన్న 8 మంది క్రికెటర్లనూ ఐసోలేషన్​కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మేకింగ్ వీడియో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో నటిస్తోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. రిలీజ్ డేట్​ను ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.