- రేపు ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 25న ఓట్ల లెక్కింపు
ఈ నెల 25న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తోంది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో లెక్కింపునకు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఒప్పందాలు ఉన్నాయి'
పాలనలో భాగంగా ప్రభుత్వం అప్పులు చేయడం తప్పుకాదని.. చేసిన అప్పుల వివరాలు సమగ్రంగా ఉండాలని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ స్టేట్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సేకరించిన 25వేల కోట్ల రూపాయల అప్పులకు.. బ్యాంకులకు ఎలాంటి షరతులు పెట్టలేదని ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అవసరమైతే కోర్టులకు వెళ్తాం'
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇళ్ల కూల్చివేతల పరిశీలనకు సీపీఐ నేతలు వెళ్లారు. సీఎం నివాసం సమీపంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీఎం ఇంటి చుట్టూ పేదలు నివసించకూడదా అని రామకృష్ణ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కేంద్రం కీలక ప్రకటన
రాజకీయ నేతలు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు సహా మరికొందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణల్ని కేంద్రం ఖండించింది. రాజ్యసభలో విపక్షాల ఆందోళనల మధ్యే ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈమేరకు ఓ ప్రకటన చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఉద్దేశపూర్వకంగానే పెగాసస్ వ్యవహారంపై వార్తలు ప్రచురితమయ్యాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్కు పరిశ్రమకు ఊతం!
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.6,322కోట్లతో ఉక్కుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. అలాగే లద్దాఖ్‌లో 'లద్దాఖ్ సమగ్ర మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ'(ఎల్ఐఐడీసీఓ) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యాసిడ్ తాగించిన భర్త!
అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించిందని.. భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించాడు అమె భర్త. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తవ్వినకొద్దీ బయటకు!
ఇంట్లోంచి గుట్టలుగా కోబ్రా పాములు బయటపడితే.. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో జరిగింది. కరౌందీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సరోజ్ సింహ గౌడ్ అనే వ్యక్తి తన ఇంట్లో పాము ఉన్నట్లు అనుమానించి పునాదుల్లో తవ్వకాలు చేపట్టాడు. ముందు ఒకటి బయటపడింది. ఆ తర్వాత మరింత లోతుగా తవ్వగా.. ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలుపెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశ్వక్రీడలకు వేళాయెరా
వివిధ దేశాధినేతలు, ఆయా దేశాల జాతీయ పతకాల రెపరెపలు, నృత్య ప్రదర్శనలు.. ఇలా అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్స్ గతేడాది కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. మొత్తంగా ఎన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు జులై 22(గురువారం) సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకతో.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్‌కు తెరలేవనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోటీ నుంచి తప్పుకుంటా!
'మా' ఎన్నికల(MAA elections 2021) గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు మంచు విష్ణు. అగ్రకథానాయకుడు బాలకృష్ణ ఈసారి మా అధ్యక్షుడైతే తానెంతో సంతోషిస్తానని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.