- అవే ఆఖరి మాటలయ్యాయి'
మరో 20 రోజుల్లో ఇంటికి వస్తానని ఆ జవాను కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పిన మాటలే చివరి మాటలయ్యాయి. ఫోన్ చేసిన మర్నాడే.. దేశ సరిహద్దులో ముష్కరులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను వీరమరణం పొందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నో ఎంట్రీ: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో నిలిచిన ధాన్యం లారీలు
ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను రాష్ట్ర సరిహద్దుల వద్ద నిలిపివేయడంపై లారీ ఓవర్స్ అసోషియేషన్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి లేఖ రాసింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో సుమారు 200 ధాన్యం లారీలు నిలిపివేశారని.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిన్న అరెస్టయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు.. నేడు బెయిలు మంజూరు అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు అనుమతి
తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. వార్డు సచివాలయం ద్వారా సీఐడీ సీఐ డిపాజిట్‌దారుల వివరాలు సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మార్పు' పవనాల మధ్య కౌంటింగ్‌కు బిహార్ సిద్ధం
'బిహార్' ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 55 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 101 కిలోల వెండితో పార్టీ అధ్యక్షుడికి తులాభారం
గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు సూరత్‌లో వెండి తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 101 కిలోల వెండిని స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బైడెన్-కమల సర్కార్ తొలి ప్రాధాన్యం వీటికే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన జో బైడెన్, కమలా హారిస్.. అధికారం చేపట్టాక చేయాల్సిన పనుల్లో వారి ప్రాధాన్యాలను వెల్లడించారు. కరోనాను జయించడం సహా పలు కీలక అంశాలపై వారి అభిప్రాయాలను తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మార్కెట్లకు కొత్త 'జో'రు- జీవనకాల గరిష్ఠాలకు సూచీలు
అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు బలపడి జీవన కాల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో తాజా గరిష్ఠాలను నమోదు చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రబాడ దగ్గరకు మళ్లీ పర్పుల్ క్యాప్.. ఆరెంజ్ రేసులో ధావన్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ పోటీదారుల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. అత్యధిక పరుగులు సాధించిన కేఎల్ రాహుల్ వద్ద ఆరెంజ్, అత్యధిక వికెట్లు పడగొట్టిన రబాడ వద్ద పర్పుల్ క్యాప్ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆదిత్య 369'లో బాలకృష్ణతో కమల్ నటించాలి.. కానీ?
బాలయ్య క్లాసిక్ సినిమా 'ఆదిత్య 369'లో విశ్వనటుడు కమల్‌హాసన్ కూడా నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అందులో చేయలేకపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.